Rohit Vemula: బీజేపీ నేతల కోసమే కేసు క్లోజ్ చేశారు.. రోహిత్ వేముల తల్లి ఆగ్రహం..
ABN, Publish Date - May 04 , 2024 | 07:21 PM
రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనే అని ఆయన తల్లి రాధిక(Radhika) స్పష్టం చేశారు. పోలీసులు రోహిత్ వేముల(Rohit Vemula) కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని, చదవలేక చనిపోయారని పోలీసులు(Telangana Police) రిపోర్టులో పేర్కొన్నారని, ఇది పచ్చి అబద్ధం అని పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 04: రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనే అని ఆయన తల్లి రాధిక(Radhika) స్పష్టం చేశారు. పోలీసులు రోహిత్ వేముల(Rohit Vemula) కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని, చదవలేక చనిపోయారని పోలీసులు(Telangana Police) రిపోర్టులో పేర్కొన్నారని, ఇది పచ్చి అబద్ధం అని పేర్కొన్నారు. రోహిత్ చదువులో ఫస్ట్ ఉండేవాడన్నారు. ఎంఎస్సీలో స్టేట్ 6 ర్యాంకర్ అని గుర్తు చేశారు రాధిక. జేఆర్ఎఫ్‌లో సైతం క్వాలిఫై అయ్యాడని పేర్కొన్నారు. రెండు విభాగాల్లో జేఆర్ఎఫ్‌లో క్వాలిఫై అయిన దేశంలోనే మొదటి స్టూడెంట్ రోహిత్ వేముల అని అన్నారు. చదవలేక చనిపోయాడు అని పోలీసుల చెప్తున్న మాట దారుణం అని.. ఈ ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాధిక.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేయడంపై ఆయన తల్లి రాధిక స్పందించారు. ఇదే అంశంపై శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రోహిత్‌పై అబద్దాలు ప్రచారం చేస్తున్నవారు.. అతను రాసిన పొయెట్రీలు చదివితే రోహిత్ గురించి తెలుస్తుందన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని.. కేసు రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసులు చేసింది మొత్తం తప్పుడు ఎంక్వైరీ అని రాధిక విమర్శించారు. కేసు పునర్విచారణ చేసి నిస్పక్షపాతంగా విచారణ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు రాధిక తెలిపారు. స్టూడెంట్స్ మీద తప్పుడు కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేయాలని సీఎం కోరినట్లు ఆమె చెప్పారు. రోహిత్ వేముల కేసు పునర్విచారణ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ నేతలకు అనుకూలంగా..
బీజేపీకి చెందిన వ్యక్తులకు అనుకూలంగానే కేసును క్లోజ్ చేశారని రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోపించారు. రోహిత్ వేముల సర్టిఫికెట్స్ ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్స్ లాంటివి కాదని అన్నారు. రోహిత్ వేముల కేసు క్లోజ్ అయిందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారని.. తాను ఉన్నంత కాలం రోహిత్ వేముల ఆత్మహత్యాపై పోరాటం చేస్తానని అన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణం అయిన వారికి శిక్షపడేదాకా పోరాటం చేస్తానన్నారు.
For More Telangana News and Telugu News..
Updated Date - May 04 , 2024 | 07:21 PM