ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: 12 రోజుల్లో యువతి పెళ్లి.. కానీ ఇంతలోనే

ABN, Publish Date - Mar 06 , 2024 | 12:18 PM

Telangana: ఆ యువతికి మరో 12 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలకు చెందిన వారు పెళ్లికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతలోనే యువతి తీసుకున్న నిర్ణయం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే యువతి.. తన ప్రాణాన్ని వదిలేసింది. నగరంలోని గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో విద్యాశ్రీ(23) అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

హైదరాబాద్, మార్చి 6: ఆ యువతికి మరో 12 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలకు చెందిన వారు పెళ్లికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతలోనే యువతి తీసుకున్న నిర్ణయం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే యువతి.. తన ప్రాణాన్ని వదిలేసింది.

TDP - Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. అసలు కారణమిదే!


అసలేం జరిగిందంటే... నగరంలోని గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో విద్యాశ్రీ(23) అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రాజన్న సిలిసిల్ల జిల్లాకు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటోంది. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం నిశ్చయం అయ్యింది. కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు విద్యాశ్రీ వెళ్లాల్సి ఉంది. అయితే అంతలోనే సోమవారం హాస్టల్ గదిలోని బాత్ రూంలో షవర్ రాడ్‌కు ఉరి వేసుకొని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన గచ్చిబౌలి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మరో 12 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా తమ కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి...

BRS: అమీర్‌పేట్ హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా

AP Highcourt: భూయాజమాన్య హక్కు చట్టంపై హైకోర్టులో విచారణ వాయిదా


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2024 | 12:18 PM

Advertising
Advertising