ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ
ABN, Publish Date - Sep 30 , 2024 | 09:40 AM
Telangana: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా బిచాణా ఎత్తివేసింది. సాహితీ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు.. ఆస్తులను అటాచ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30: రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ (Sahiti Infra MD Laxminarayana) ఈడీకి (ED) చిక్కారు. లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు సాహితీ ఇన్‌ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా బిచాణా ఎత్తివేసింది. సాహితీ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు.. ఆస్తులను అటాచ్ చేశారు.
Telangana Tourism: తక్కువ బడ్జెట్‌తో వీకెండ్ ట్రిప్.. తెలంగాణ మినీ మాల్దీవులు బెస్ట్
సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని సాహితీ ఇన్ఫ్రా మోసం చేసి బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లోని సుమారు 3 వేల మంది వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. చివరకు తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులిచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే 200 కోట్ల ఆస్తులను సీసీఎస్ పోలీసుల అటాచ్ చేశారు. సుమారు 3వేల కోట్లకు పైగా వసూళ్లు చేసి సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ పరారయ్యాడు.
Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..
కాగా.. ఫ్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్దఎత్తున సాహితీ ఇన్‌ఫ్రా డబ్బు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. సాహితీ స్వాద్ పేరుతో రూ.65 కోట్లు, సిస్టాఅడోబ్ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు,.. సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు, ఆనంద ఫర్చూన్ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.16 కోట్లు, సాహితీ సుదిక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్లు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు. భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా వసూళ్లకు పాల్పడింది.
ఏపీలో కూడా...
గతంలో ఏపీలోను సాహితీ ఇన్ఫ్రా యజమాని బుదాటి లక్ష్మీనారాయణపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు ఆస్తులను అటాచ్ చేశారు. కోట్లల్లో మోసం జరగడంతో సీసీఎస్ పోలీసులు కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీ నారాయణను ఈడీ కార్యాలయానికి తీసుకోచ్చిన అధికారులు విచారణను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 30 , 2024 | 10:09 AM