ACB: శివబాలకృష్ణ వద్ద పనిచేసిన అటెండర్, డ్రైవర్ అరెస్ట్
ABN, Publish Date - Feb 14 , 2024 | 02:26 PM
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టరన్ శివబాలకృష్ణ వద్ద అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టరన్ శివబాలకృష్ణ వద్ద అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణకు వచ్చే లంచం డబ్బును తీసుకురావడంలో గోపీ, హబీబ్ కీలకంగా వ్యవహరించారు. దీనికి ప్రతిఫలంగా ఇద్దరు పేరుపై పలు ఆస్తులను శివబాలకృష్ణ కూడబెట్టినట్లు విచారణలో గుర్తించారు. డ్రైవర్ గోపీకి శివ బాలకృష్ణ హోండా సిటీ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై ఉన్న బినామీ ఆస్తులను గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.
బినామీలకు నోటీసులు...
కాగా.. శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు జారీ అయ్యాయి. మరింత లోతుగా విచారించేందుకు విచారణ హాజరుకావాలని వారికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ జరుగనుంది. ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. 2021 నుండి 2023లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో బయటపడింది. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణకు 57 ఎకరాల భూమిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 14 , 2024 | 02:26 PM