ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ

ABN, Publish Date - Jun 02 , 2024 | 02:55 PM

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్‌(Karimnagar)లో హామీ ఇచ్చానన్నారు.

Congress Parliamentary Party Chairperson Sonia Gandhi

ఢిల్లీ: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్‌(Karimnagar)లో హామీ ఇచ్చాను. అప్పట్లో దీనిపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. చాలా మంది మా పార్టీని విడిచిపెట్టారు, కానీ తెలంగాణ ప్రజల సహనం, సంకల్పం నా కల సాకారానికి సహాయపడింది. గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రజలు నాకు ఎంతో గౌరవం, ప్రేమను ఇచ్చారు. సుభిక్షమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని నిర్మించడానికి మీరు మా పార్టీకి అప్పగించిన కలలన్నీ నెరవేర్చడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీని నెరవేర్చడంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రగతి, ఉజ్వల భవిష్యత్తు కోసం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని సోనియా గాంధీ అన్నారు.


ఇదిలా ఉండగా రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న వేడుకలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైభవంగా అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలకు హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇదే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయానికి.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి:

Crime news: నగరంలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్..

For more Telangana news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 02:59 PM

Advertising
Advertising