Gaddam Prasad: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 02 , 2024 | 01:20 PM
Telangana: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ళలో శాసనసభ సరిగా నిర్వహించలేదన్నారు. ప్రజలకు శాసనసభలో ఏం అవుతుందో కూడా తెలియకపోయేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారు.
హైదరాబాద్, మార్చి 2: అసెంబ్లీ సమావేశాలపై (Telangana Assembly Session) స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ళలో శాసనసభ సరిగా నిర్వహించలేదన్నారు. ప్రజలకు శాసనసభలో ఏం అవుతుందో కూడా తెలియకపోయేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారు. చిన్న పిల్లలు కూడా శాసనసభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు.
శ్రీపాదరావు గురించి మాట్లాడుతూ... శ్రీపాదరావు అసెంబ్లీలో ఉన్న సమయంలో తాను లేనందుకు బాధగా ఉంటుందన్నారు. శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాద రావుని స్మరించుకుంటూనే ఉందామని స్పీకర్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
TS news: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద జయంతి వేడుకలు...
YSRCP: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్సార్సీపీ ఓడిపోతుందని ఒప్పుకున్నట్టేనా..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 02 , 2024 | 01:20 PM