ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా టీ సేఫ్ యాప్

ABN, Publish Date - Aug 21 , 2024 | 04:27 PM

Telangana: మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శిక్ష, శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Minister Seethakka

హైదరాబాద్, ఆగస్టు 21: మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శిక్ష, శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు.

TG HighCourt: జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత చేపట్టవద్దన్న హైకోర్ట్


మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయన్నారు. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. మత్తు బానిసలపై నిఘా పెంచుతామన్నారు. ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్లు కూడా అభద్రతాభావంలో ఉండటం బాధాకరమన్నారు. మహిళా డాక్టర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తామన్నారు.

Botsa: 75 రోజులేగా అయ్యింది... వారికి టైము ఇవ్వాలిగా!



మహిళా భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ‘‘అమ్మాయిలు మహిళల భద్రత మీ బాధ్యత అని అన్ని విద్యాసంస్థలకు తెలియ చెబుతాం’’ అని అన్నారు. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా పాఠశాలల్లో పాఠాలు బోధిస్తామన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పెంచేలా చర్యలు చేపడతామన్నారు. మహిళా భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రారంభించిన టీ సేఫ్ యాప్ బాగా పనిచేస్తుందన్నారు. టీసేఫ్ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. ఈ యాప్‌ను ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందుకొచ్చాయన్నారు. టీసేఫ్ యాప్‌కు మరింత ప్రచారం కల్పిస్తామన్నారు. ఆటోలు, క్యాబుల్లో టీ సేఫ్ నెంబర్లను ప్రచారం చేస్తామన్నారు. మహిళా భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను త్వరలో సీఎంకు సమర్పిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Ponguleti Srinivas: టూరిజం ప్లేస్‌గా నేలకొండపల్లి అభివృద్ధే లక్ష్యం..

TG News: ఫార్మాలిటీస్ పేరుతో ఆలస్యం.. గాల్లో కలిసిన బాలిక ప్రాణం

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 04:43 PM

Advertising
Advertising
<