ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chicken Biryani: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:59 PM

హైదరాబాద్ మహానగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సిగరెట్ పీకలు, బొద్దింకులు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమైనాయి.

హైదరాబాద్, డిసెంబర్ 06: మహానగరంలో హోటళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు నిర్వహించినా.. వారు మాత్రం తమ పద్దతిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. హైదరాబాద్‌లో బావార్చి హోటల్‌లో చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు ప్రత్యక్షమైనాయి. చికెన్ బిర్యానీ తింటున్న కస్టమర్లకు అందులో ట్యాబ్లెట్లు ప్రత్యక్షం కావడంతో.. వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వారు యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇంతలో వీడియో తీస్తున్న కస్టమర్లుపై హోటల్ యాజమాన్యం ఆగ్రహంతో ఊగిపోయింది.


దాంతో బావర్చి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఇదే హోటల్‌లో చోటు చేసుకున్న ఇది రెండో ఘటన. పది రోజుల క్రితం.. ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమైనాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకు వెళ్లారు. వాళ్లు పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సైతం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. అదీకాక నగరంలో క్రాస్ రోడ్స్‌లోని బావార్చి హోటల్ ప్రముఖ బిర్యానీ హోటల్‌గా ఖ్యాతి పొందిన సంగతి తెలిసిందే.


మరోవైపు బంజారాహిల్స్‌లోని బిర్యానీ వాలా హోటల్‌లో ఇటీవల బొద్దింక ప్రత్యక్షమైంది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని కస్టమర్లు ప్రశ్నించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుళ్లిన మాంసం, గడువు తీరిన కారం, మషాళా ప్యాకెట్ల వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి.. ఆయా హోటళ్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.. చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా హోటల్ యజమానులు అయితే తమ నిర్లక్ష్య ధోరణిని మాత్రం వీడడం లేదు. అదే విధంగా హోటళ్లలోని కిచెన్‌లో సైతం పరిశుభ్రత పాటించడం లేదని పలు దాడుల్లో వెలుగులోకి వచ్చిన విషయం విధితమే.


ఇంకోవైపు ఇటీవల జీహెచ్‌ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మీ సారథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాత బస్తీలో పలు దుకాణాలపై దాడులు చేశారు. ఈ సందర్బంగా ఓ దుకాణంలో.. మాంసం తింటున్న ఎలుకను చూసి సాక్షాత్తు మేయర్ షాక్‌కు గురయ్యారు. దీంతో నియమ నిబంధనలు పాటించిన పలు షాపులను సీజ్ చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్.. జోక్యం చేసుకుని.. సీజ్ చేసిన షాపులు తిరిగి తెరవాలంటూ అధికారులను బెదిరించారు. దాంతో షాపులు తెరవక తప్పలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మేయర్ విజయలక్ష్మీ.. ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్‌పై కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

For Telangana News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 04:02 PM