ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: జర్నలిస్ట్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

ABN, Publish Date - Sep 26 , 2024 | 01:10 PM

సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ కన్నుమూశారు. డాబాపై వాకింగ్ చేస్తోండగా కాలుజారి పడిపోయారు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. నారాయణ చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. నారాయణ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

Journalist Narayana

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ టి ఆదినారాయణ (Journalist Narayana) ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందారు. గురువారం ఉదయం అపార్ట్ మెంట్‌పై వాకింగ్ చేస్తుండగా జారిపడ్డారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోకి తీసుకెళ్లేలోపు చనిపోయారు. గత 25 ఏళ్ల నుంచి నారాయణ ఈటీవీలో పనిచేస్తున్నారు. నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


సీఎం రేవంత్ సంతాపం

నారాయణ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. నారాయణ అకాల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం

నారాయణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. సమాజంలో మార్పు కోసం కృషి చేశారని పేర్కొన్నారు. నారాయణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


బాధాకరం..

జర్నలిస్ట్ ఆది నారాయణ మృతి బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉంన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురయిన నారాయణ కోలుకుంటారని ఆశించానని తెలిపారు. ఇంతలో మరణ వార్త వినాల్సి వచ్చిందని బాధ పడ్డారు.


లోకేశ్ సంతాపం

ఆదినారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్దతతో కృషి చేశారని తెలిపారు. అలాంటి జర్నలిస్ట్‌ను కోల్పోయామని, ఆది నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


అనారోగ్యానికి గురైన నారాయణ

ఆది నారాయణ స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈటీవీలో 25 ఏళ్లుగా పనిచేశారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. నారాయణ మృతిపై కోలిగ్స్, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం బోన్ మారో కాన్సర్ బారిన పడ్డారు. వ్యాధి చికిత్స తీసుకుంటున్నారు. తర్వాత ఆరోగ్యం కుదటపడింది. తర్వాత క్యాన్సర్ వ్యాధి తిరగబెట్టిందని సన్నిహితులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్‌వోసీ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం కిమో చికిత్స తీసుకున్నారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. నారాయణ మృతిపై జర్నలిస్ట్ సంఘాలు, సహచరులు విచారం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: వైసీపీకి ఎదురుదెబ్బ.. జనసేనలోకి బొత్స..

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 26 , 2024 | 01:15 PM