Telangana Assembly Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సీఎం రేవంత్ విశ్వరూపం
ABN, Publish Date - Jul 29 , 2024 | 10:41 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. దీంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చలు జరగనున్నాయి. అలాగే ఈరోజు 19 పద్దులపై సభలో చర్చించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఐదవ రోజు (5th Day) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. దీంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ (Voting of Demands for Grants)పైనే చర్చలు జరగనున్నాయి. అలాగే ఈరోజు 19 పద్దులపై సభలో చర్చించనున్నారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతుంది. మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) లపై చర్చ జరుగుతుంది.
ఐటి, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాది, రవాణ, బీసీ సంక్షేమం, పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్‌లపై చర్చ జరగనుంది. 19 పద్దులపై చర్చించిన తర్వాత శాసనసభ అమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోం శాఖలు ఉన్నాయి. ఈ క్రమంలో వీటిన్నింటిపై సభలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
గత ప్రభుత్వం విద్యాశాఖను ఎలా ధ్వంసం చేసిందో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. విద్యుత్ పద్దులపై కూడా హాట్ హాట్‌గా చర్చ జరిగే అవకాశం ఉంది. మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఉదయ్ స్కీంపై సంతకం చేయలేదని, మీటర్లు పెట్టలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో సభలో ఈరోజు ఆసక్తికర చర్చ సాగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలు ఛీ కొట్టిన వాళ్ల బుద్ధి మారలేదు..
విశాఖ మేయర్ సీటుపై ఎన్డీయే కన్ను...!
వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...
సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 29 , 2024 | 12:07 PM