ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weather: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

ABN, Publish Date - Sep 22 , 2024 | 05:13 PM

హైదరాబాద్‌లో సోమ, మంగళ, బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. నగరంలోని పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ..

Heavy Rains

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదారాబాద్‌కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో సోమ, మంగళ, బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. నగరంలోని పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Narendra Modi: గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన


హైదరాబాద్‌లో..

హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 103.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని గోల్కొండలో గణనీయమైన వర్షపాతం నమోదైంది. నగరంలో 91.3 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఆగమనం తర్వాత తెలంగాణలో గణనీయమైన వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సగటున 919 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇది సాధారణ వర్షపాతం 703.6 మి.మీ కంటే 31 శాతం ఎక్కువని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. సాధారణ వర్షాపాతం 575.5 మి.మీ కాగా.. ఇప్పటివరకు 780.4 మి.మీ వర్షపాతం నమోదైందని.. దాదాపు 36 శాతం అధికంగా నమోదైనట్లు తెలిపారు.

ఢిల్లీ సీఎం పీఠంపై ఆతిశీ


ఈరోజు భారీ వర్షాలు..

హైదరాబాద్‌ నగరంలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు రాత్రికి ఉప్పల్‌, నాగోల్‌, బండ్లగూడ, ఎల్‌బీ నగర్‌, సరూర్‌నగర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌, మీర్‌పేట్‌, గుర్రంగూడ, వనస్థలిపురంలోనూ వర్షాలు పడతాయని వెల్లడించారు.

నూతన వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌

Rahul Gandhi : నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 22 , 2024 | 05:13 PM