Big Breaking: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు..
ABN, Publish Date - Mar 10 , 2024 | 05:53 PM
Brs Leaders Joined in BJP: పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ(BJP)లో చేరారు. బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం అన్నారు ఎంపీ లక్ష్మణ్.
Brs Leaders Joined in BJP: పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ(BJP)లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కేటీఆర్‌కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు.. బీజేపీలో చేరారు. వీరే కాదు.. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పని ఖతం..
బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందన్నారు. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మోడీ ప్రభుత్వం దేశం కోసం పని చేస్తుందన్నారు లక్ష్మణ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 10 , 2024 | 05:53 PM