Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ మీటింగ్.. నిర్ణయాలపై ఉత్కంఠ
ABN, Publish Date - Mar 12 , 2024 | 12:47 PM
Telangana: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈరోజు (మంగళవారం) జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశంకానుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కేబినెట్ సమావేశం అవుతుండటంతో అందులో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) ఈరోజు (మంగళవారం) జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశంకానుంది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ముందు కేబినెట్ సమావేశం అవుతుండటంతో అందులో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లపై చర్చించి పేర్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు 2500 పథకం, పెళ్లికి తులం బంగారం స్కీం, మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాలపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
MP Avinash Reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి మరో పిటిషన్
ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. నాలుగు డీఏలలో రెండు డీఏల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల పీఆర్సీపైనా (PRC) నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోకసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే రైతు భరోసా, రైతు రుణమాఫీపై కూడా కేబినెట్ చర్చించనుంది. రానున్న అవసరాలకు సాగు, తాగు నీటిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ధరణిపై కేబినెట్లో చర్చకు రానుంది. సిట్ విచారణ జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలోని కొన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2008 డీఎస్సీ (DSC) అభ్యర్థులకు కేబినెట్ తీపి కబురు అందించనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 15 అంశాలతో విచారణ.. అలాగే కొడంగల్ ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయోచ్..
Chennai: వామ్మో.. ఐఐటీ ప్రాంగణంలో గంజాయి.. ఇద్దరి అరెస్ట్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 12 , 2024 | 12:48 PM