Mallareddy: మల్లారెడ్డా మజాకా.. సన్‌గ్లాస్ పెట్టి గోవా బీచ్‌లో రచ్చ రచ్చే..!
ABN, Publish Date - Jan 09 , 2024 | 04:36 PM
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో.. మల్లారెడ్డి మంత్రి పదవి కూడా పోయింది. దీంతో ఆయన టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 09: తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో.. మల్లారెడ్డి మంత్రి పదవి కూడా పోయింది. దీంతో ఆయన టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విద్యా సంస్థలకు అధిపతిగా.. రాజకీయ నేతగా, బిజినెస్ మెన్‌గా సక్సెస్ సాధించిన మల్లారెడ్డి.. తన మాటలు, చేతలతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. తన సక్సెస్‌ని పేర్కొంటూ పాలమ్మిన.. పూలమ్మిన.. బిజినెస్ చేసిన.. సక్సెస్ అయిన అంటూ చెప్పిన డైలాగ్స్ తోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీలను మించి ఫేమస్ అయిపోయారు.
అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వంతో పాటు.. ఆయన మంత్రి పదవి కూడా పోయింది. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి.. కాస్త రిలాక్స్ కోసం గోవా ట్రిప్ వేశారు. గోవా బీచ్‌లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. సీ బోటింగ్‌కు వెళ్లారు. సీ పారాగ్లైడింగ్ కూడా చేశారు. అంతేకాదు.. సముద్రంలో తానే స్వయంగా బోట్ నడిపి హుషారెత్తించారు. కళ్లకు సన్ గ్లాస్ పెట్టుకుని.. బోట్‌ను నడుపుతూ కేరింతలు కొట్టారు మల్లారెడ్డి. మల్లారెడ్డి జోష్‌ను వీడియో తీసి.. వాటిని సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి. మల్లారెడ్డి ఎంటర్టైన్‌మెంట్‌ను చూసి నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మల్లారెడ్డి స్టైలే వేరు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు మల్లారెడ్డి డైలాగ్స్‌ను ఇమిటేట్ చేస్తూ.. కామెంట్స్ పెట్టారు. కష్టపడ్డా.. గోవాకెళ్లా.. ఎంజాయ్ చేశా.. అంటూ మల్లారెడ్డి డైలాగ్స్‌కు పేరడి డైలాగ్స్ వదులుతున్నారు నెటిజన్లు.
Updated Date - Jan 09 , 2024 | 04:36 PM