ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High court: ఫార్ములా- ఈ కార్ రేసు.. హైకోర్టు సంచలన తీర్పు..

ABN, Publish Date - Dec 20 , 2024 | 05:22 PM

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. వారం రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

BRS Working President KTR

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు (Formula-E car race) కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (BRS Working President KTR)కు భారీ ఊరట లభించింది. వారం రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ (ACB) తన దర్యాప్తును కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈనెల 30 లోగా రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.


కాగా, ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఏబీసీ తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్.. హైకోర్టులో నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలు వినింది. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని న్యాయస్థానానికి సుందరం తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేసిందని, ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్‌కు వర్తించవని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి అసలు ఆధారాలే లేవని చెప్పారు. కేటీఆర్ లబ్ధి చేకూరినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్‌ను వారం రోజుల వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.


కేటీఆర్ తరఫు వాదనలు ఇవే..

  • 2023 అక్టోబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారు.

  • అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుంది?

  • పబ్లిక్ సర్వెంట్ నేరపూరితంగా ప్రవర్తిస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.

  • కానీ ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌లో నేరపూరిత దుష్ప్రవర్తన ఎక్కడా జరగలేదు.

  • అందుకే 13(1)a, 409 అనే సెక్షన్‌లు వర్తించవు.

  • ఫార్ములా రెస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారు.

  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధం?

  • ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి, కానీ ఏసీబీకి సంబంధం లేదు.

  • రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే, కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు.

  • ఈ విషయంలో కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు?, ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్ధం.

  • అఫెన్స్ జరిగిందని తెలిసిన మూడు నెలలలోపే కేసు రిజిస్టర్ చేయాలి. కానీ 11నెలల తర్వాత నమోదు చేశారు.

  • లలిత కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్‌ను ప్రస్తావించిన కేటీఆర్ న్యాయవాది

  • సీజన్ 10 నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్ వెనక్కి తగ్గారు.

  • రేస్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదనే అప్పటి ప్రభుత్వం రంగమైలోకి దిగింది.

  • అందులో భాగంగానే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.

  • పీసీ యాక్ట్‌లో డబ్బులు ఎవరికి వెళ్లాయో వాళ్లని నిందితులుగా చేర్చాలి. కానీ ఇక్కడ డబ్బులు చేరింది FEO సంస్థకు.

  • FEO సంస్థను అసలు నిందితుడిగా చేర్చలేదు, ఇది కరప్షన్ కేస్ ఎలా అవుతుంది, పీసీ యాక్ట్ 13(1) ఎలా వర్తిస్తుంది?


ప్రభుత్వం తరఫు వాదనలు..

  • ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతోంది, ప్రతి విషయం ఎఫ్ఐఆర్‌లో ఉండదన్న ఏజీ సుదర్శన్‌ రెడ్డి

  • దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతం అవుతాయి. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంది.

  • రెండు నెలల క్రితం MAUD చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారు.

  • విచారణకు గవర్నర్ కూడా అనుమతించారు, దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని అడిగిన హైకోర్టు

  • గవర్నర్ అనుమతి పత్రాలను న్యాయమూర్తి సమర్పించిన ఏజీ సుదర్శన్ రెడ్డి

  • దర్యాప్తులో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో వారి పేర్లు బయటకు వస్తాయన్న ఏజీ

  • విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యింది.

  • ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే FIR నమోదు చేశారనేది అవాస్తవం. ప్రాథమిక దర్యాప్తు జరిగింది.

  • అగ్రిమెంట్ లేకుండానే రెండు దఫాలో డబ్బులు పంపారు.

  • 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో డబ్బులు పంపారు. అప్పటికి అగ్రిమెంట్ జరగలేదు.

  • 2023 అక్టోబర్ 30న రెండో అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బులు పంపింది ఈ అగ్రిమెంట్ కోసమే.

  • మొదటి అగ్రిమెంట్‌ను 2023 అక్టోబర్ 27న రద్దు చేసుకున్నారు.

  • ఒకవేళ ప్రభుత్వానికి భారీ లాభం వస్తే స్పాన్సర్ వెనక్కి వెళ్లడు.

  • FEOకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయి.

  • HMDA ఇందులో భాగస్వామి కాకున్నా రూ.55 కోట్లు చెల్లించింది.

  • ఇందులో కేటీఆర్‌కు ఎలాంటి లబ్ధి చేకూరిందని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి

  • ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందనేది దర్యాప్తులో తేలుతుందన్న ఏజీ

  • ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనేది పూర్తి దర్యాప్తు జరిగితేనే తెలుస్తుంది.

  • అగ్రిమెంట్‌కు ముందే చెల్లింపులు జరిపారు, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న టైమ్‌లో అగ్రిమెంట్ చేసుకున్నారు.

  • ప్రాథమిక దర్యాప్తును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తే అనుమతి ఇచ్చాకే FIR నమోదు చేశారు.

  • పిటిషనర్ సమర్పించిన సుప్రీంకోర్టు తీర్పు కాపీలన్నీ ట్రైల్ ముగిసిన తర్వాత ఇచ్చిన తీర్పులు

  • డబ్బులు పంపడంలో కేటీఆర్ సూత్రధారుడు, గత ప్రభుత్వంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు.

  • డబ్బులు పంపాలని ఫైల్‌పై సంతకం చేసింది కేటీఆరే. ఈ కేసులో 409 సెక్షన్ వర్తిస్తుంది.

  • డబ్బులు పంపే సమయానికి అసలు అగ్రిమెంట్ లేదు.

  • రూ.56 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కు సమాచారం లేకుండానే FEOకు పంపారు.

  • క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు లేదు.

  • FIR నమోదు చేసిన తర్వాతి రోజే క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు అర్హత లేదు.

Updated Date - Dec 20 , 2024 | 06:09 PM