BRS Party: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..
ABN, Publish Date - Sep 18 , 2024 | 01:54 PM
Nalgonda BRS Office: భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు.. నల్లగొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది.
Nalgonda BRS Office: భారత రాష్ట్ర సమితి పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ భవనాన్ని కాపాడాలని వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు.. అక్రమంగా కట్టిన నల్లగొండ జిల్లాలోని ఆపార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు విధించింది. ఇంతకీ ఏం జరిగింది? హైకోర్టు ఎందుకు అలాంటి ఆదేశాలిచ్చింది? కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించారని, దాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారులను సైతం ఆదేశించారు. కూల్చివేతకు అధికారులు రంగంలోకి దిగారు.
హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్..
పార్టీ భవనం నేలమట్టం కాబోతోందని తెలుసుకున్న బీఆర్ఎస్.. ఎలాగైనా ఆపాలని హైకోర్టును ఆశ్రయించింది. ఆఫీసును క్రమబద్ధీకరించే విధంగా పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. పార్టీ కార్యాలయం కట్టిన తరువాత ఏ రకంగా అనుమతిస్తారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి గానీ.. కట్టిన తరువాత ఎలా అనుమతి తీసుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ అధికారులకు సూచించింది. దీనికితోడు రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్‌ను ఆదేశించింది.
Updated Date - Sep 18 , 2024 | 03:24 PM