ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Formula E Racing: తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్.. ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:00 PM

Telangana: గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. సీజన్‌-9 ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్‌ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్‌ రేసింగ్‌ లిమిటెడ్‌ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి.

Formula E Racing

హైదరాబాద్, అక్టోబర్ 29: పార్ములా ఈ కార్ రేస్ (Formula E Racing) నిర్వహణకు సంబంధించి నిధుల గోల్‌మాల్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం జరిపిన కేటాయింపులపై ఏసీబీకి మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ కోరింది. కోట్లల్లో నిధులు బదిలీలు జరగడంపై మున్సిపల్ శాఖ విచారణ కోరింది. నిబంధనలు పాటించకుండా ఎమ్‌ఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు రూ. 55కోట్ల చెల్లింపులు జరిగాయి. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సెషన్ -10 రద్దు అయ్యింది. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగాయి.

PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్థల వివాదం


కాగా.. గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. సీజన్‌-9 ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్‌ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్‌ రేసింగ్‌ లిమిటెడ్‌ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.

Indian Railways: దీపావళి పండగ వేళ ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్


ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్కో, ఫార్ములా-ఈనే భరించాల్సి ఉంది. కానీ.. గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి దానిస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్‌ ఐఏఎస్‌ ఒకరు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఈవెంట్‌ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు.


ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్‌ రేస్‌ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం ‘సెషన్‌-10’ రద్దయింది. ఫిబ్రవరి 10న ఈవెంట్‌ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది. కానీ, ఇంతలో విషయం బయటపడడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఫార్ములా-ఈ రేసుపై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలాఉండగా.. ఈ రేసింగ్‌లో నిధుల గోల్‌మాల్‌ అంశంపై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. మరి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


ఇవి కూడా చదవండి...

Babumohan: టీడీపీ గూటికి బాబుమోహన్

Bandi Sanjay: కేసీఆర్‌ కుటుంబంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2024 | 04:04 PM