ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Group-2: చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నాం: TGPSC ఛైర్మన్

ABN, Publish Date - Dec 15 , 2024 | 11:02 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్‌ ఉంటే ఉద్యోగం వస్తుందని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం అన్నారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.

హైదరాబాద్: చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష (Group 2 Exam) నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం (TGPSC Chairman, Burra Venkatesham) అన్నారు. ఆదివారం ఉదయం బేగంపేట్‌లోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరు కావాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఫలితాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. నాలుగు సార్లు వాయిదా పడ్డ తరువాత ఈ సారి పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. గ్రూప్ 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2 కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్‌ ఉంటే ఉద్యోగం వస్తుందని ఆ కమిషన్‌ చైర్మన్‌ బుర్రా వెంకటేశం అన్నారు. గతంలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను 2015లో విడుదల చేస్తే.. 2019లో నియామకాలు జరిగాయని, ఇకపై టీజీపీఎస్సీలో అలాంటి ఆలస్యం ఉండబోదన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి నుంచి 9-12 నెలల మధ్యలో నియామకాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గ్రూప్‌-2తోపాటు.. ఇదివరకే నిర్వహించిన గ్రూప్‌-3 ఫలితాలను మార్చిలోగా విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. శనివారం ఆయన కమిషన్‌ సభ్యుడు రామ్మోహన్‌రావుతో కలిసి, విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 783 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైందని, ఆది, సోమవారాల్లో 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 5,51,847 మందిహాజరుకానున్నారని వివరించారు. ‘‘ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండేసి సెషన్లలో రెండ్రోజుల్లో నాలుగు పేపర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి.

ఉదయం సెషన్‌లో 9.30లోపు.. మధ్యాహ్నం 2.30లోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి. ఆ తర్వాత గేట్లను మూసివేస్తాం’’ అని స్పష్టంచేశారు. ‘‘2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ వెలువడింది. రెండు కోర్టు కేసులతో.. రెండేళ్ల తర్వాత పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా 75ు మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 80ు మంది దాకా అభ్యర్థులు పరీక్షలు రాసే అవకాశాలున్నాయి. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సిలబస్‌ నుంచే ప్రశ్నలుంటాయి. ఏ పుస్తకాలను చదవాలనేది అభ్యర్థుల ఇష్టం’’ అని వివరించారు. గ్రూప్‌-2 ఓఎంఆర్‌ షీట్లు అభ్యర్థుల వారీగా ఉంటాయని, పరీక్ష ప్రారంభం కావడానికి ముందే అందులోని వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. బయోమెట్రిక్‌ హాజరు ఉన్న అభ్యర్థుల పత్రాలను మాత్రమే వాల్యుయేషన్‌కు పంపుతామని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇది రెండో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌. 2022లో రెండో నోటిఫికేషన్‌ వస్తే.. 2024లో పరీక్షలు పెడుతున్నాం. మార్చిలోగా గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫలితాలను విడుదల చేస్తాం’’ అని వెల్లడించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)పై బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది అభ్యర్థులు మాత్రమే సీబీటీ విధానంలో పరీక్షలు రాసే సదుపాయాలున్నాయన్నారు. అందుకే తాము సీబీటీ జోలికి వెళ్లడం లేదన్నారు.


యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీ

యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందుకోసం 18, 19వ తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తామన్నారు. ‘‘18న యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి పరీక్ష, నియామక ప్రక్రియను పరిశీలిస్తాం. కేంద్ర సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ హీరాలాల్‌ సమారియాను కలిసి, సమాచార హక్కు చట్టం కింద ఏయే సమాచారం ఇవ్వాలి? వంటి వివరాలపై అధ్యయనం చేస్తాం. 19న స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎ్‌ససీ) చైర్మన్‌ను, ఆ తర్వాత జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) చైర్మన్‌ను కలుస్తాం. సంస్థాగత మార్పులు, సంస్కరణలపై 2025 జనవరి నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. ఈ ఏడాదిలో 13 వేల ఉద్యోగాలను తెలంగాణ కమిషన్‌ భర్తీ చేసింది. ఏడాదిలో యూపీఎస్సీ 5 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుంది. యూపీఎస్సీ కేవలం సివిల్స్‌ పరీక్షలను నిర్వహించి, మిగిలిన ప్రక్రియలను ఎస్‌ఎ్‌ససీకి అప్పగిస్తుంది’’ అని వివరించారు. ఏ పరీక్షకు నోటిఫికేషన్‌ను విడుదల చేసినా.. పరీక్షలు, సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌, నియామక ప్రక్రియను 9 నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తల్లికి సాయం, తండ్రికి స్నేహం. అన్నదమ్ములకు ఆసరా

మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..

అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం

ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 15 , 2024 | 11:02 AM