ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:04 PM

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పార్సిళ్లను హోమ్ డెలివరీ చేసేందుకు సేవలకు శ్రీకారం చుట్టింది. దీపావళి సందర్భంగా అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సేవలను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది.

హైదరాబాద్, నవంబర్ 01: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ నిర్వహిస్తున్న కార్గో సేవల ద్వారా బుక్ చేసుకున్న పార్సిళ్లను నేరుగా హోమ్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన సేవలను దీపావళి పండగ సందర్భంగా అంటే.. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ సేవలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.

Also Read: మెంతి కూర ఆకుతో ఇన్ని లాభాలా..?


అలాగే ఈ సేవల ద్వారా బుక్ చేసుకునే పార్సిళ్లకు కేజీల బట్టి రుసుం వసూల్ చేస్తామని వివరించింది. కేజీ నుంచి ఐదు కేజీల వరకు రూ. 50. అలాగే కేజీ బరువు దాటిన నాటి నుంచి ఐదు కేజీల వరకు రూ. 60. ఐదు కేజీల నుంచి 10 కేజీల వరకు రూ. 65. పది కేజీలపై నుంచి 20 కేజీల వరకు రూ. 70. 20 కేజీలపై నుంచి 30 కేజీల వరకు రూ. 75 వసుల్ చేస్తామని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు.. 9030134242, 3030135242 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.

Also Read: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు


ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బస్ సర్వీసులను తొలగించింది. ఆయా బస్ సర్వీసులను కార్గో సేవలుగా మార్చింది. దీంతో టీజీఎస్‌ఆర్టీసీకి మంచి లాభాలు వచ్చాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ కార్గో సేవల వలే... పార్సిళ్ల సేవలతో హోమ్ డెలివరీ చేస్తే.. సంస్థకు మరింత ఆదాయం వస్తుందని టీజీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?


మరోవైపు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట మహాలక్ష్మీ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం వల్ల సంస్థకు నష్టం వస్తుందనే ఓ ప్రచారం అయితే సాగుతుంది. అలాంటి వేళ.. సంస్థ వివిధ మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులోభాగంగా పార్సిళ్లను హోమ్ డెలివరీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే ఓ చర్చ సైతం సంస్థ ఉద్యోగుల్లో కొనసాగుతుంది.


ఇంకోవైపు హైదరాబాద్ మహానగరంలో రాత్రి 9.00 గంటల తర్వాత పలు ప్రాంతాలకు అటు సికింద్రాబాద్ నుంచి ఇటు అఫ్జల్‌గంజ్ నుంచి సీటి బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో నగరానికి చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. 040 69440000, టోల్ ఫ్రీ నెంబర్ 8008432929, 040-30102829 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆర్ఠీసీ అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయడం వల్ల ఆ యా మార్గాల్లో రాత్రి వేళ్లలో బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని వివరిస్తున్నారు.

For Telangana News And Telugu News..

Updated Date - Nov 01 , 2024 | 01:04 PM