ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మొత్తం 1200 మంది ఫోన్లు.. ఈ టెక్నాలజీతోనే ట్యాపింగ్..!

ABN, Publish Date - May 29 , 2024 | 06:39 PM

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. పోలీసుల విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌ కోసం విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Phone Tapping Case

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. పోలీసుల విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌ కోసం విదేశాల నుంచి పరికరాలు కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ప్రణీత్‌రావు అండ్ కో ఫోన్ ట్యాపింగ్ కోసం హైదరాబాద్‌ టెక్నాలజీనే వాడినట్లు విచారణలో తేలింది. కన్వర్జేన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇచ్చిన పరికరాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 1200మంది ఫోన్లు ట్యాప్ చేయగా.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను కేవలం 45 నిమిషాల్లోనే చెరిపేశామని.. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో ప్రణీత్‌రావు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Phone Tapping: ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు


ఆ సమయంలోనే అంతా..

డిసెంబర్ 4వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను చెరిపేశామని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కన్వర్జేన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కు చెందిన శ్రీనివాస్, అనంత్ ను ఎస్ఐబి ఆఫీస్ కు పిలిచి.. వారు ఇచ్చిన సర్వర్లు, హార్డ్ డిస్కులు వారికి ఇచ్చినట్లు ప్రణీత్‌రావు పోలీసులకు తెలిపారు. కంప్యూటర్ కి ఉన్న 50 హార్డ్ డిస్క్ లను తొలగించి కొత్త వాటినీ రీప్లేస్ చేశామని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ సిసి కెమెరాలను ఆఫ్ చేశారని, తమ ఆదేశాలు పాటించేందుకు అనిల్ కుమార్ మొదటి నిరాకరించగా.. చివరికి అతడిని భయపెట్టి సీసీ కెమెరాలు ఆఫ్ చేయించినట్లు ప్రణీత్‌రావు పోలీసుల వద్ద చెప్పారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది.


Praneeth Rao: ఆ 17 హార్డ్ డిస్క్‌లను మూసారంబాగ్ మూసిలో పడవేశాం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 06:39 PM

Advertising
Advertising