ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP vs Congress: సీఎం రేవంత్ రెడ్డి మార్పుపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. కొత్త సీఎంపై ఏమన్నారంటే

ABN, Publish Date - Nov 02 , 2024 | 05:06 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటెందన్నారు. ప్రస్తుతం సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. అసలు మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయన్నారు. ఈ నెల 6 లేదా 7 వ తేదిన కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో మరొకరికి సీఎం బాధ్యతలు అప్పగిస్తారంటూ శాసనసభలో బీజేపీ పక్షనేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటెందన్నారు. ప్రస్తుతం సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. అసలు మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయన్నారు. ఈ నెల 6 లేదా 7 వ తేదిన కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల హామీలపై మాట్లాడిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.


కేంద్రానికి వినతి..

దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే అంతే ఫలాలు అందాలని రాహుల్ గాంధీ భావించారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కుల గణన పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని తెలిపారు. కుల గణనపై కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావుల తో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని తెలిపారు. ఈ నెల 5 వ తేదిన బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ కుల, విద్యార్థి సంఘాల నాయకుల సమావేశం అవుతారని వెల్లడించారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సర్వే లో పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ కోరారు.


కొత్త సీఎం ప్రస్తావనపై..

సీఎం రేవంత్ రెడ్డి ఉండగా మళ్ళీ కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీలో కనీస గౌరవం లేదని, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు సీటు కూడా లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 6 లేదా 7వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి కుల గణనతో పాటు అనేక అంశాలపై అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామన్నారు.


మహేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే..

తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది మారుస్తారని, ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేదా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని సీఎం చేస్తారంటూ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 02 , 2024 | 05:06 PM