ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

ABN, Publish Date - Nov 02 , 2024 | 09:48 AM

Traffic Restrictions in Hyderabad: నారాయణగూడ వైఎంసీఏలో శనివారం సదర్‌ వేడుకలు జరుగనున్న దృష్ట్యా.. రాత్రి 7 నుంచి ఆదివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్టు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి. విశ్వప్రసాద్‌ ప్రకటించారు.

Traffic Restrictions

హైదరాబాద్‌, నవంబరు 2: నారాయణగూడ వైఎంసీఏలో శనివారం సదర్‌ వేడుకలు జరుగనున్న దృష్ట్యా.. రాత్రి 7 నుంచి ఆదివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్టు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి. విశ్వప్రసాద్‌ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ఆయా రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఏసీపీ చూసించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన రూట్లలో వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందన్నారు. వాటి వివరాలను కూడా ఏసీపీ వెళ్లడించారు. మరి ఏయే రూట్లలో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఓసారి చూద్దాం..


ట్రాఫిక్ మళ్లించేది ఈ రూట్లలోనే.. ప్రయాణికులు ఇది గమనించాలి..

• రాంకోఠి నుంచి వచ్చే వాహనాలు కాచిగూడ ఎక్స్‌రోడ్‌ మీదుగా టూరిస్ట్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలి.

• లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలు కాచిగూడ ఎక్స్‌రోడ్‌ నుంచి బాటా ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్లాలి.

• పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి సెమెంటరీ వైపు వచ్చే వాహనాలు విఠల్‌వాడి ఎక్స్‌రోడ్‌ నుంచి రాంకోఠి ఎక్స్‌ రోడ్డు వైపు వెళ్లాలి.

• విఠల్‌వాడి ఎక్స్‌రోడ్‌ నుంచి రాజమొహల్ల చిల్లా వైపు వచ్చే వాహనాలు పద్మశాలి భవన్‌ నుంచి రాంకోఠి ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్లాలి.

• ఆర్‌టీసీ ఎక్స్‌రోడ్‌, క్రౌన్‌ కేఫ్‌ మీదుగా వచ్చే వాహనాలు నారాయణగూడ ఎక్స్‌రోడ్‌ మీదుగా హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు వెళ్లాలి.

• నారాయణగూడ ఎక్స్‌రోడ్‌ నుంచి రాజ్‌బహదూర్‌ వెంకట్రామిరెడ్డి కాలేజ్‌ వైపు వచ్చే వాహనాలు బాబా టెంట్‌ వద్ద నుంచి క్రౌన్‌ కేఫ్‌ వైపు వెళ్లాలి.


• బాగ్‌లింగంపల్లి వైపు నుంచి వైఎంసీఏ వచ్చే వాహనాలు రెడ్డి కాలేజ్‌ జంక్షన్‌ నుంచి బాబా టెంట్‌ హౌస్‌ వైపు వెళ్లాలి.

• బర్కత్‌ఫుర చమన్‌ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలు పోస్టాఫీస్‌ జంక్షన్‌ నుంచి క్రౌన్‌ కేఫ్‌ వైపునకు వెళ్లాలి.

• క్రౌన్‌ కేఫ్‌ నుంచి లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ వైపు వెళ్లే వాహనాలు పోస్టాఫీస్‌ జంక్షన్‌ నుంచి నుంచి బర్కత్‌ఫుర చమన్‌ వైపు వెళ్లాలి.

• లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ వైపు నుంచి రాజ్‌బహదూర్‌ వెంకట్రామిరెడ్డి కాలేజ్‌ వైపు వచ్చే వాహనాలు మాతా ఆలయం నుంచి పోస్టాఫీస్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలి.

• కాచిగూడ ఎక్స్‌రోడ్‌, టూరిస్ట్‌ జంక్షన్‌ నుంచి పోస్టాఫీస్‌ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలు లింగంపల్లి చౌరస్తా నుంచి టూరిస్ట్‌, కాచిగూడ జంక్షన్‌ల వైపు వెళ్లాలి.

• ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సు సర్వీసులనూ దారి మళ్లించారు.

• సదర్‌ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే వారు తమ వాహనాలను కేశవ మెమోరియల్‌ గ్రౌండ్‌లో పార్కు చేయాలని పోలీసులు సూచించారు.

• రాకపోకల మళ్లింపు నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి.

• ఇబ్బందులుంటే పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 90102 03626ను సంప్రదించాలి.


Also Read:

లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు

ఆలయాలకు కార్తీక శోభ

ఈ శిశువు మృత్యుంజయుడు! తల్లిదండ్రులు వంతెనపై నుంచి విసిరేస్తే..

For More Telangana News and Telugu News..

Updated Date - Nov 02 , 2024 | 09:48 AM