ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ACB Raids: లేడీ ఆఫీసర్ ఇంట్లో ఎక్కడ చూసినా నగదే.. సోదాలతో విస్తుపోయిన ఏసీబీ!

ABN, Publish Date - Feb 20 , 2024 | 11:36 AM

Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (HMDA Siva Balakrishna) అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే జ్యోతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ విషయం...

లంచం తీసుకుంటున్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆపై జ్యోతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ నగదును, బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇంతటి బంగారాన్ని చూసి అధికారులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. మరికాసేపట్లో కోర్టులో హాజరుపరుచనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 01:00 PM

Advertising
Advertising