CM Revanth: గద్దర్‌తో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్
ABN, Publish Date - Aug 06 , 2024 | 11:37 AM
Telangana: ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గద్దర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులులర్పించారు. ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా’’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా..
హైదరాబాద్, ఆగస్టు 6: ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గద్దర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులులర్పించారు. ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ‘‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా’’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంత తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని పేర్కొన్నారు.
Egg Rate: బాబోయ్.. కొండెక్కిన కోడిగుడ్డు ధర!
తెలంగాణ జన సమితి, తెలంగాణ జన సభతో పాటు పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ అని గుర్తు చేశారు. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని, ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చిందని తెలిపారు. గద్దర్‌తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందు పసిగట్టిన ‘కింగిణి’
ట్వీట్...
‘‘పాటకు పోరాటం నేర్పి
తన గళంలో తూటాగా మార్చి
అన్యాయం పై ఎక్కుపెట్టిన
తెలంగాణ సాంస్కృతిక శిఖరం’’ గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అంటూ సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
సొంత మనిషిలా భావించి...
ప్రజా యుద్ధ నౌకగా పేరుగడించిన గద్దర్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో చర్చకు దారి తీశాయి. అయితే అప్పటి టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ.. అక్కడ అన్నీ చూసుకుంది మాత్రం రేవంత్ రెడ్డే. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్‌ను కాంగ్రెస్ తన సొంతమనిషిలా చూసుకుని ఘనంగా వీడ్కోలు పలికింది.
మాట నిలబెట్టుకున్న రేవంత్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
Madanapalle Incident: గత ఐదేళ్లలో ఏదో జరిగింది!
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 06 , 2024 | 12:12 PM