ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP CM Chandrababu: ఈనెల 5న హైదరాబాద్‌లో ఏపీ సీఎంకు గ్రాండ్ వెల్కమ్..

ABN, Publish Date - Jul 03 , 2024 | 08:30 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈనెల 5న తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. దీంతో ఏపీ సీఎంకు పెద్దఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీటీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 4గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈనెల 5న తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు(AP CM Chandrababu Naidu) రానున్నారు. దీంతో ఏపీ సీఎంకు పెద్దఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీటీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 4గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.


బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు తెలంగాణ టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంతో చంద్రబాబుకి ప్రత్యేక సంబంధం ఉందని, ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తోందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘనస్వాగతం పలకాలని కార్యకర్తలు, నాయకులను పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ కోరారు.

Updated Date - Jul 03 , 2024 | 08:42 PM

Advertising
Advertising