ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్.. ఇదంతా చేసింది ఎవరో తెలిస్తే...

ABN, Publish Date - Apr 11 , 2024 | 04:22 PM

Telangana: రాజేంద్రనగర్‌లో పట్టపగలే దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారనే వార్త తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్‌ను పోలీసులు బయటపెట్టారు. అసలు దొంగతనమే జరగలేదనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇదంతా ఆ ఇంట్లోని యువతి ఆడిన డ్రామాగా నిర్ధారించారు. ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో యువతి ఇంతటి డ్రామాకు తెరతీసినట్లు ఖాకీల విచారణలో బయటపడింది. యువతి చేసిన పనికి షాక్ అవడం కుటుంబ సభ్యుల వంతైంది.

రంగారెడ్డి, ఏప్రిల్ 11: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో (Rajendranagar) పట్టపగలే దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారనే వార్త తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్‌ను పోలీసులు బయటపెట్టారు. అసలు దొంగతనమే జరగలేదనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇదంతా ఆ ఇంట్లోని యువతి ఆడిన డ్రామాగా నిర్ధారించారు. ఆన్‌లైన్‌ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో యువతి ఇంతటి డ్రామాకు తెరతీసినట్లు ఖాకీల విచారణలో బయటపడింది. యువతి చేసిన పనికి షాక్ అవడం కుటుంబ సభ్యుల వంతైంది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజేంద్రనగర్‌లో ఉదయం 10 గంటలకే దుండగులు చోరీకి తెగపడినట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో యువతి వాష్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీర్వాలో నగదు, నగలను అపహరించారని, పట్టుకోబోయిన తనను తోసేసి పారిపోయారని సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామా క్రియేట్ చేసినట్లు గుర్తించారు. పథకం ప్రకారం ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు, ఇతర వస్తువులను యువతి చిందరవందరగా పడేసింది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడిన యువతి రూ.25 వేలు పోగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతి డ్రామాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే దుండగుల చోరీ అని తెలిసి తీవ్ర భయాందోళనకు గురయ్యామని.. అయితే ఇదంతా ఉత్తిదే అని తెలిసి ఊపిరిపీల్చుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

Viral: ఈ తండ్రి పరిస్థితి చూస్తే గుండె జారిపోవాల్సిందే.. 3వ తరగతి చదువుతున్న కొడుకు కోసం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 04:50 PM

Advertising
Advertising