Allu Arjun: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం
ABN , Publish Date - Dec 22 , 2024 | 09:43 AM
సంధ్యా ధియేటర్ వద్ద పుష్ప- 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.
హైదరాబాద్: సంధ్యా ధియేటర్ వద్ద పుష్ప- 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న(శనివారం) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధం అవుతున్నారు. పోలీసులు రూట్ క్లియర్ చేస్తేనే తాను సంధ్య థియేటర్‌కు వెళ్లానంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు. ఇప్పటికే డిసెంబర్ 4న స్పెషల్ షో సందర్భంగా ధియేటర్ యాజమాన్యం అడిగిన పర్మిషన్ ఇవ్వడం కుదరదని స్థానిక పోలీసులు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయితే, సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ అల్లు అర్జున్ పలు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అనుమతి తీసుకునే ముందుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అల్లు అర్జున్ కామెంట్లపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
అల్లు అర్జున్ ఏమన్నారంటే..
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఎవరి తప్పు లేదని స్పష్టం చేశారు. పుష్ప 2 టీమ్‌తో కలిసి మంచి ఉద్దేశంతోనే ధియేటర్‌కు వెళ్లానని చెప్పారు. సినిమాను ప్రమోట్ చేయడానికి తాము వెళ్లామని, కానీ అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని చెప్పారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అన్నారు. ఈ ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పుష్ప -2 విజయం సాధించిన తాను ఇంట్లోనే ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఈ ఘటనలో తాను ఎవర్నీ తప్పుపట్టడం లేదని అన్నారు. ప్రభుత్వంతో ఎలాంటి వివాదం పెట్టుకోవాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందని అల్లుఅర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మానవత్వం లేదా ?
Child Custody: పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
MLC Jeevan Reddy: హోంగార్డుల వేతనం పెంచాలి: జీవన్ రెడ్డి
Read Latest Telangana News and Telugu News