ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ఎక్కడా లేదేమో

ABN, Publish Date - Oct 25 , 2024 | 04:37 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నారని.. ఆయన మాటపై ఆయనకే స్పష్టత లేదని అన్నారు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదని... ఆ అల్లుడి కోసమే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Union Minister Bandi Sanjay

హైదరాబాద్, అక్టోబర్ 25: ‘‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది.. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం’’ అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్పష్టం చేశారు. మూసీ ప్రాంతాల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ మహాధర్నాలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించిందని.. ఇప్పుడు విషం కక్కుతోందన్నారు.

YS Jagan vs YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ..


‘‘నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా. మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్‌కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమను. అలా వెళ్తే ప్రజలు వాళ్ళను గంప కింద కుమ్ముతారనే భయం రేవంత్‌కు ఉంది. రేవంత్ మొన్న మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని ఒకసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే. బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు.. వారిది నోరా.. మోరా’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ అని.. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలంటూ సెటైర్ విసిరారు. సబర్మతి ఖర్చు రూ.7 వేల కోట్లు అని, నమామి గంగ ఖర్చు రూ.40 వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా అని ప్రశ్నించారు. ఒక్క కిలోమీటర్‌కు 2 వేల కోట్లా అని నిలదీశారు. ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ప్రపంచంలో లేదన్నారు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి అని అన్నారు. ‘‘మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. మీ అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’’ అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.

Viral Video: తొందరపాటు ఎంత పని చేస్తుందో తెలుసా.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో..



రేవంత్.. లంకె బిందలు మూసీలో ఉన్నాయా: ఏలేటి

రేవంత్ లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పావు కదా.. ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా? అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్ విసిరారు. బీజేపీ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే ఆ ఇండ్లకు అనుమతి ఇచ్చారని.. ఇప్పుడు ఎలా అక్రమమయ్యాయో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణను ఏటీఎంలాగా మార్చుకోవాలనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు, అక్రమ సంపాదన కోసం పేదల ఇండ్లను కూలిస్తే ఉరుకోబోమన్నారు. ‘‘మాకు లండన్, సియోల్ అక్కర్లేదు.. మాకు మా హైదరాబాద్ లాగానే ఉంచండి చాలు. గతంలో కేసీఆర్ ఇస్తాంబుల్ లాగా మారుస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు లండన్, సియోల్ అంటున్నారు. రేవంత్ సర్కార్‌కు పేదల భూములే కనిపిస్తున్నాయా? ఎంఐఎం నేతలవి కనిపించడం లేదా. పేదలవి కూల్చి.. ఎంఐఎం నేతలవి ఎందుకు కూల్చడం లేదు. డీపీఆర్.. లేకుండా ఎలా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.. ఎలా కూలుస్తున్నారు. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకునేది లేదు’’ అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Dating Scam: అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..

Kishan Reddy: రేవంత్ నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అందుకు మేము సిద్ధమే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2024 | 04:42 PM