ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ఆ ఛార్జీలు రద్దు..

ABN, Publish Date - May 05 , 2024 | 09:23 AM

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు.

TSRTC

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కవు దూరం ప్రయాణించే ప్రయాణీకులు 8రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేజన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజుఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవడం వల్ల ప్రయాణీకుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూరప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణంగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ రుసుము కింద ఒక్కో ప్యాసింజర్‌ రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అదే సూపర్ లగ్జరీ లేదా ఆపై బస్సుల్లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.50 రిజర్వేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. టికెట్‌ను ప్రయాణ సమాయానికి 8 రోజుల ముందు బుక్‌చేసుకుంటే అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లపై ఎటువంటి రుసుము తీసుకోబోమని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు.

నేను పక్కా లోకల్‌.. గరీబోళ్ల బిడ్డను!


ప్రత్యేక బస్సులు

వేసవి నేపథ్యంలో తెలంగాణ నుంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. యాత్రికుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి.. శ్రీశైలానికి బస్సు సర్వీసులు, ఫ్రీక్వెన్సీని పెంచాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సు సర్వీసులు మహత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) నుండి తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమతాయి. రాత్రి 11:45 వరకు కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


వండర్ లా వద్ద..

హైదరాబాద్‌లోని వండర్‌లాకు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ బస్సులో వండర్‌లా వెళ్తే పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం రాయితీ అందిస్తోంది. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్‌లాకు TSRTC బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించి.. వండర్‌లాకు వచ్చే వారికి.. పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.


Telangana: ఉక్కపోతలకు ఉపశమనం.. ఈ జిల్లాలకు వర్షసూచన

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Telangana News and National News

Updated Date - May 05 , 2024 | 09:31 AM

Advertising
Advertising