ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Assembly: అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వర్డ్స్ వార్.. ఆర్మూర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 09 , 2024 | 02:30 PM

ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన ఐడి కార్డును చూపిస్తూ.. ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని..

MLA Rakesh Reddy

తెలంగాణ శాసనసభకు ఇవాళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోయినా.. తొలిరోజు సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభంకాగానే తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీనిపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జరిగిన చర్చ సందర్భంగా ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన ఐడి కార్డును చూపిస్తూ.. ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని, తాను ఆర్మూరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేనో కాదో చెప్పాలన్నారు. స్పీకర్ శాసనసభకు తండ్రి వంటి వారని, సభ్యుల గౌరవానికి భంగం కలిగించకుండా చూసే బాధ్యత స్పీకర్‌దని పేర్కొన్నారు. ఇటీవల ఆర్మూరు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా మంత్రి పరిచయం చేశారని ఆరోపిస్తూ.. రాకేశ్ రెడ్డి ప్రోటోకాల్ అంశాన్ని శాసనసభలో లేవనెత్తారు. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం దక్కడం లేదన్నారు. తన గురించి మాట్లాడటం లేదని ఎమ్మెల్యేల గౌరవం విషయంలో తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై బీజేపీ సభ్యులు, కాంగ్రెస్ మంత్రుల మధ్య కాసేపుతీవ్ర వాగ్వాదం కొనసాగింది.


మంత్రి శ్రీధర్‌బాబు ఏమన్నారంటే..

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పీకర్ ఆదేశానుసారం నడుచుకుంటామని, దీనిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇది సరైన సందర్భంగా కాదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం ప్రకటనపై చర్చ జరుగుతోందని, సభ్యులంతా ఆ అంశానికే పరిమితం కావాలని మంత్రి సూచించారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయని గుర్తుచేశారు. స్పీకర్ పట్ల సభ్యులు గౌరవంగా వ్యవహారించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. మంత్రి సమాధానంపట్ల బీజేపీ ఎమ్మెల్యేలు సంతృప్తి చెందలేదు. తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగాలని బీజేపీ సభ్యులు కోరారు.


స్పీకర్ రియాక్షన్

బీజేపీ సభ్యుల ప్రస్తావించిన అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యేకు తగిన గౌరవం లభిస్తుందని, ఈ అంశంపై అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ శాసనసభ్యులు రాకేశ్ రెడ్డి, వెంకటరమణారెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో తన ఛాంబర్‌లో సమావేశమవుతానని ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 09 , 2024 | 02:30 PM