ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఒక్కసారిగా మారిన వాతవరణం.. భారీ వర్షం..

ABN, Publish Date - Jun 02 , 2024 | 05:20 PM

Heavy Rain in Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో(Telangana Capital Hyderabad) వాతావరణం(Weather) ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు ఎండ దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన వర్ష సూచన(Rain Alert to Hyderabad) కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి.

Heavy Rains in Hyderabad

Heavy Rain in Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో(Telangana Capital Hyderabad) వాతావరణం(Weather) ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు ఎండ దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన వర్ష సూచన(Rain Alert to Hyderabad) కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. నల్లటి దట్టమైన మేఘాలు నగర వ్యా్ప్తంగా ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. నగరంలో మరికాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.


జీహెచ్ఎంసీ అలర్ట్..

భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆయా విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అలర్ట్‌గా ఉన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలకుండగా, రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా.. చెట్లు, హోర్డింగ్స్ కూలిపోతే వెంటనే తొలగించేలా అధికారులు సమాయత్తం అయ్యారు. మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు బల్దియా అధికారులు. 040-21111111, 9000113667 నెంబర్లను ప్రకటించారు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలియజేయాల్సిందిగా అధికారులు తెలిపారు.


తెలంగాణ జిల్లాల్లో వర్షం..

తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పలకరించింది. బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ తదితర మండలాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో ఒక్క సారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, షాద్‌నగర్, మోత్కూరు, వలిగొండ, భువనగిరి సహా హైదరాబాద్‌లోని ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లిలో భారీ వర్షకురుస్తోంది.

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 02 , 2024 | 05:20 PM

Advertising
Advertising