ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rakhi Festival: సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మహిళానేతలు

ABN, Publish Date - Aug 19 , 2024 | 01:16 PM

Telangana: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీకట్టేందుకు ఉత్సహం చూపుతున్నారు. ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుకుని రక్తంపంచుకు పుట్టిన సోదరులకు రాఖీలు కట్టి బహుమతులు అందుకుంటున్నారు. అలాగే వారి ఆశీర్వచానలు పొందుతున్నారు.

CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 19: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీకట్టేందుకు ఉత్సహం చూపుతున్నారు. ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుకుని రక్తంపంచుకు పుట్టిన సోదరులకు రాఖీలు కట్టి బహుమతులు అందుకుంటున్నారు. అలాగే వారి ఆశీర్వచానలు పొందుతున్నారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధులందరికి మహిళలు రాఖీలు కట్టేందుకు క్యూకడుతున్నారు.

PM Modi Video: విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు..


జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy)మహిళా మంత్రులు, ఎంపీలు, మహిళా నేతలు రాఖీలు కట్టి వారి ఆనందాన్ని తెలియజేశారు. మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు సీఎంకు రాఖీ కట్టారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాఖీ కట్టే సమయంలో ముఖ్యమంత్రి సతీమణి, కుమార్తె, మనవడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలా నేతలు రాఖీ కట్టడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రికి రాఖీ కట్టడంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ... సీఎంకు కూడా రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపానని.. చాలా సంతోషంగా ఉందని అన్నారు. సోదరీ సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. రాఖీ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మాయిలను నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందన్నారు. మహిళా భద్రతకు పాటుపడదామని రాఖీ పండుగ సందర్భంగా అందరూ ప్రతినభూనాలన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంస్కృతి అని అన్నారు. ప్రతి అడపడుచు, అన్నదమ్ములతో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకునే పండగ రాఖీ పండగ అని అన్నారు. సోదరులు అందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని తెలిపారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పులు వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతుందన్నారు. ప్రతి సోదరుడు తన సోదరికి సమాజంలో ఎలా సెక్యూరిటీ, గౌరవం పొందాలి అనుకుంటారో.. అలాగే ప్రతి ఒక్కరూ తమ అక్క చెల్లమ్మల మాదిరి సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలని అన్నారు. ప్రతి మహిళను మన ఇంటి బిడ్డగా చూస్తే అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగవన్నారు. ‘‘ ఆడబిడ్డలకు స్వేచ్చగా తిరేగే అవకాశం ఇద్దాం.. ఎదగనిద్దాం ’’ అంటూ అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

AP News: మాక్ పోలింగ్ వ్యవహారం.. బాలినేని పిటిషన్‌పై ముగిసిన ఇవాళ్టి విచారణ


హరీష్‌కు రాఖీ కట్టిన మహిళామణులు...

రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ కోకాపేట్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల శ్రేయస్సు, భద్రత కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని హరీష్ రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Abhishek Singhvi: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్

TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 01:58 PM

Advertising
Advertising
<