Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:17 AM
ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ సాప్టువేర్ కంపెనీ హైసా (హెచ్‌వైఎ్‌సఈఏ) ముందుకొచ్చింది.
రూ.3 కోట్లతో 10వేల నిత్యావసరాల కిట్లు
ఖమ్మం సంక్షేమ విభాగం, సెప్టెంబర్ 8: ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ సాప్టువేర్ కంపెనీ హైసా (హెచ్‌వైఎ్‌సఈఏ) ముందుకొచ్చింది. బాధితులకు పంపిణీ చేసేందుకు రూ.3 కోట్ల వ్యయంతో 10 వేల నిత్యావసరాల, వస్తువుల కిట్లును సిద్ధం చేసింది. ఒక్కో కిట్‌లో రూ.3 వేల విలువ కలిగిన నిత్యావసరాలు, ఇతర వస్తువులు ఉంటాయి. ఈ కిట్లతో కూడిన వాహనాలను ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ వాహనాలు హైదరాబాద్ నుంచి ఖమ్మానికి బయలుదేరాయి.
Updated Date - Sep 09 , 2024 | 04:17 AM