ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైడ్రా ఫోకస్‌.. ఇక ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై..

ABN, Publish Date - Oct 18 , 2024 | 07:55 AM

వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది.

- నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై హైడ్రా దృష్టి

- రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు స్పెషల్‌ డ్రైవ్‌

- ముందే సమాచారమిచ్చి చర్యలు తీసుకుంటామన్న రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి.. దుకాణదారులకు ముందే సమాచారం ఇస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఇందుకోసం ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయాలని గురువారం ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ పీ విశ్వప్రసాద్‌(Additional Commissioner P Vishwaprasad)తో కలిసి ఆయన ట్రాఫిక్‌ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు


భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) బృందాలు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయనున్నాయి. ఇందుకోసం డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్‌ డక్‌లు, జీహెచ్‌ఎంసీ చెత్త డబ్బాలనూ ఆయా విభాగాలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


వేగంగా వరద నీరు తొలగేలా...

గ్రేటర్‌లో అధికారిక లెక్కల ప్రకారం వరద నీరు నిలిచే ప్రాంతాలు 144 ఉన్నాయి. ఇందులో 65 ఏరియాలు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Hyderabad Police Commissionerate) పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు వర్షపు నీరు నిలుస్తున్నట్టు కొత్తగా గుర్తించిన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా వరద నీరు తొలగించేలా ఎక్కువ హార్స్‌పవర్‌తో కూడిన మోటార్లను వినియోగించాలని నిర్ణయించారు. పంప్‌ చేసిన నీరు సమీపంలోని నాలాలు, వరద నీటి డ్రైన్లలోకి వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు.


వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంతో పాటు, కొత్త డ్రైన్‌లు నిర్మించడం ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించాలని నిర్ణయించారు. ప్రాంతాల వారీగా ట్రాఫిక్‌, వరద నీటి నిర్వహణకు పనిచేసే బృందాల సమాచారం ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.


ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి

ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్‌ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం

ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు

ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 18 , 2024 | 08:01 AM