HYDRA: హైడ్రా కీలక ప్రకటన.. ఆ ఇళ్లను కూల్చబోమంటూ..
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:09 PM
Hydra: అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనంగా మారిన హైడ్రా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆ ఇళ్లను కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో హైడ్రా పేరు సంచలనంగా మారింది. అక్రమార్కుల గుండెల్లో ఇది రైళ్లు పరిగెత్తించింది. ప్రభుత్వ జాగాలను కబ్జా చేసి ఇళ్లు కట్టిన అక్రమార్కులకు దడ పుట్టించిన హైడ్రా నుంచి తాజాగా కీలక ప్రకటన వచ్చింది. ఆ ఇళ్లను కూల్చబోమంటూ ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎక్కడి నిర్మాణాల గురించి ఆయన ఈ కామెంట్స్ చేశారు? ఏ ప్రాంతంలోని ఇళ్లను కూల్చబోమని చెప్పారో ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం..
వాళ్లు సేఫ్!
ఈ ఏడాది జులై నెల తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘గతంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు మేం వెళ్లబోం. అయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కడుతున్న వాటిని మాత్రం కూల్చక తప్పదు. నూతనంగా తీసుకున్న అనుమతులను పరిశీలిస్తాం. సర్కారు విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నాం. పేదల జోలికి హైడ్రా మాత్రం రాదు. వాళ్ల ఇళ్లను కూల్చేస్తామనే ప్రచారాలను అస్సలు నమ్మొద్దు’ అని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
Also Read:
ఆ ఇళ్లకు ఈఎంఐలు మీరు చెల్లిస్తారా.. కవిత సూటి ప్రశ్న
తెలంగాణ అసెంబ్లీలో అప్పులపై రగడ.. నేతల మధ్య మాటల యుద్ధం
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
For More Telangana And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 03:10 PM