ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైడ్రా స్పీడ్‌ పెంచేలా..!

ABN, Publish Date - Aug 28 , 2024 | 05:26 AM

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణల కూల్చివేతలను మరింత ముమ్మరం చేసేందుకు హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) రంగం సిద్ధం చేస్తోంది. క

  • సంస్థ ముందుకు వేలల్లో ఫిర్యాదుల

  • పరిశీలనకు సరిపడా సిబ్బంది కరువు

  • 72 బృందాల ఏర్పాటుకు హైడ్రా యోచన

  • ఉద్యోగులు కావాలని ప్రభుత్వానికి వినతి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణల కూల్చివేతలను మరింత ముమ్మరం చేసేందుకు హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) రంగం సిద్ధం చేస్తోంది. కబ్జాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి తనిఖీలకు బృందాలను పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆరు బృందాలు చెరువుల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నాయి. ఈ సిబ్బంది సరిపోకపోడంతో భారీగా ఫిర్యాదులు పేరుకుపోతున్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అవసరమైన సిబ్బందిని సమకూర్చుకునేలా అనుమతి ఇవ్వాలంటూ హైడ్రా మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఔటర్‌ వరకు 2,050 చదరపు కి.మీ. విస్తీర్ణంలోని ప్రాంతాలకు సంబంధించి 72 బృందాలను ఏర్పాటు చేయాలని హైడ్రా భావిస్తోంది. మొత్తంగా సంస్థలోని అన్ని విభాగాలకు 3,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేస్తోంది. సరిపడా సిబ్బంది అందుబాటులోకి వస్తే ఫిర్యాదుల పరిశీలన వేగవంతమవుతుందని సంస్థ ధీమాగా ఉంది. ప్రస్తుతం టెండర్‌ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీతో కూల్చివేతలు చేపడుతున్నారు. యంత్రాలు, ఇతర పరికరాలను ఆ ఏజెన్సీనే సమకూర్చుకుంటోంది. పరిశీలనా బృందాల సంఖ్య పెరిగిన పక్షంలో కూల్చివేతలూ భారీ స్థాయిలో చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏజెన్సీలనూ సిద్ధం చేయనున్నారు.


ఫాక్‌ సాగర్‌ను పరిశీలించిన రంగనాథ్‌

జీడిమెట్లలోని ఫాక్‌ సాగర్‌ను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మంగళవారం పరిశీలించారు. విషయం తెలుసుకున్న పక్కనున్న బస్తీల వాసులు ఆయనను కలిశారు. 30, 40 ఏళ్ల క్రితం నుంచి అక్కడే ఉంటున్నామని.. కూల్చివేస్తే రోడ్డున పడతామని చెప్పారు.

పేదల ఇళ్ల జోలికి రాబోమని.. వారి ఇళ్లను కూల్చడం తమ ఉద్దేశం కాదని రంగనాథ్‌ వివరించారు. ఫాక్‌ సాగర్‌ను మరోసారి పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో 20కిపైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. రంగనాథ్‌ రాకతో ఆక్రమణదారుల్లో వణుకు మొదలైంది.

Updated Date - Aug 28 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<