ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జీవో 111 ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి?

ABN, Publish Date - Aug 22 , 2024 | 03:58 AM

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్‌హౌ్‌సలపై చర్యలుంటాయా..? చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ,

  • ఉన్నతస్థాయిలో చర్చలు..

  • పరిశీలిస్తున్న ప్రభుత్వం చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వాస్తుల

  • ఔటర్‌ వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలు హైడ్రా పరిధిలోనే..

  • హిమాయత్‌సాగర్‌లో కూల్చివేతలపై ప్రతిష్టంభన

  • ప్రభుత్వాన్ని స్పష్టత కోరనున్న హైడ్రా

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్‌హౌ్‌సలపై చర్యలుంటాయా..? చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ, ఆస్తుల సంరక్షణ సంస్థ(హైడ్రా) బడాబాబుల అతిథి గృహాల జోలికి వెళ్తుందా? అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా విదివిధానాల ప్రకారం ప్రస్తుతం అతిథి గృహాలపై చర్యలకు అవకాశం లేదు. కానీ, భవిష్యత్తులో జీవో 111 పరిధిలోని ప్రాంతాలను హైడ్రా కిందకు తీసుకొచ్చే అవకాశం ఉ న్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో హైడ్రా అధికారాల పరిధిని పెంచుతారని సమాచారం.


ఈ విషయంపై ఉన్నతస్థాయిలోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవంగా హైడ్రా ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న సమయంలోనే జీవో 111 ప్రాంతాలను సంస్థ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. జల వనరులు, పార్కులు, ప్రభుత్వ స్థలా ల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తొలుత సంస్థ ఏర్పా టు చేయాలని.. పనితీరు, స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు సమాచారం. నెల రోజుల క్రితం పురుడు పోసుకున్న సంస్థ పనితీరుపై తెలంగాణలోనే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి.


హైడ్రా ఏర్పాటు, విదివిధానాలపై రిటైర్డ్‌ ఐఏఎ్‌సలు, ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ, ఏపీ ప్రజల నుంచి హైడ్రా వంటి సంస్థ ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీకి మరిన్ని హక్కులు కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఇక జీహెచ్‌ఎంసీతో పాటు ఔటర్‌ వరకు ఉన్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలను తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీ జియన్‌(టీసీయూఆర్‌)గా పేర్కొంటూ.. దాన్ని హైడ్రా పరిధిగా ప్రభుత్వం నిర్ణయించింది.


ఆయాప్రాంతాల్లో ని చెరువులు, పార్కులు, లేఅవుట్‌లోని ఖాళీ స్థలాలు, ఆట స్థలాలు, నాలాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, వాటిలోని ఆక్రమణల తొలగింపు హైడ్రా బాధ్యతలుగా జీవో99లో పేర్కొన్నారు. ఇందుకోసం సంస్థలో ప్రత్యేకంగా ‘ఆస్తుల సంరక్షణ’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణకు మరో విభాగాన్ని ప్రతిపాదించారు. ఓఆర్‌ఆర్‌ వెలుపలి ప్రాంతా లు కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. నార్సింగ్‌, బండ్లగూడ, శంషాబాద్‌, తుక్కుగూడ, ఆదిభట్ల, దుండిగల్‌ మునిసిపాలిటీల్లోని పలు గ్రామాలు ఔటర్‌ వెలుపల ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనూ హైడ్రా చర్యలు తీసుకోనుంది.


  • ఎఫ్‌టీఎల్‌ ప్రతిష్టంభన..

చెరువుల్లో ఆక్రమణల తొలగింపులో న్యాయపరమైన చిక్కులు లేకుండా హైడ్రా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో చెరువుల ఎఫ్‌టీఎల్‌ నోటిఫై చేశారా? లేదా? అన్నది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఔటర్‌ వరకు 400కు పైగా చెరువులుండగా.. మెజారిటీ చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణకు సంబంధించి హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ఆధారంగా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. గండిపేట జలాశయం ప్రాథమిక నోటిఫికేషన్‌ గతంలోనే ప్రకటించగా దాని ఆధారంగానే ఇటీవల భవనాలు నేలమట్టం చేశారు.


హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ ప్రకటించలేదు. దీంతో ఆ జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాల తొలగింపుపై తాత్కాలికం గా ప్రతిష్టంభన నెలకొంది. దీనిపైనా ప్రభుత్వంతో చర్చించాలని హైడ్రా భావిస్తోంది. గతంలో గుర్తించిన ఎఫ్‌టీఎల్‌ ఆధారంగా చర్యలు తీసుకోవాలా? నోటిఫై చేసే వరకు వేచి చూడాలా? అన్న దానిపై సర్కారును స్పష్టత కోరనుంది.


  • ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు..?

హైడ్రా పరిధిని పెంచాలన్న డిమాండ్‌లూ వస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక, పరిరక్షణ లేకనే జీహెచ్‌ఎంసీ, ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాల్లో చెరువులు, పార్కులు అన్యాక్రాంతమయ్యాయి. ఔటర్‌ను దాటి ప్రస్తుతం అభివృద్ధి విస్తరిస్తున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లోనూ జలాశయాలు, ఖాళీ స్థలాలు, పార్కులు ఆక్రమణకు గురయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలు జరిగాక నిర్మాణాలు తొలగించడం కంటే.. ముందస్తుగా కబ్జాలు నియంత్రించేందుకు రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) వరకు హైడ్రా పరిధిని విస్తరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2024 | 03:58 AM

Advertising
Advertising
<