Illegal Construction: రోడ్డు ఆక్రమించి నిర్మాణం.. ఇల్లు కూల్చివేత!
ABN, Publish Date - Nov 19 , 2024 | 02:41 AM
రోడ్డును ఆక్రమించి ఓ లేఅవుట్‌లో నిర్మించిన ఇంటిని సోమవారం ఉదయం హైడ్రా బృందాలు కూల్చివేశాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని బీరంగూడ వందనపురి కాలనీలో సర్వేనంబర్ 848 పరిఽధిలోకి వచ్చే రోడ్డును ఆక్రమించి రిజిస్టర్ డాక్యుమెంట్ సృష్టించారు.
అమీన్‌పూర్‌లో కాలనీవాసుల ఫిర్యాదుతో హైడ్రా కొరడా
భారీ యంత్రాలతో నేలమట్టం.. స్థానికుల హర్షం
పటాన్‌చెరు, నవంబరు, 18 (ఆంధ్రజ్యోతి): రోడ్డును ఆక్రమించి ఓ లేఅవుట్‌లో నిర్మించిన ఇంటిని సోమవారం ఉదయం హైడ్రా బృందాలు కూల్చివేశాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని బీరంగూడ వందనపురి కాలనీలో సర్వేనంబర్ 848 పరిఽధిలోకి వచ్చే రోడ్డును ఆక్రమించి రిజిస్టర్ డాక్యుమెంట్ సృష్టించారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించడం ప్రారంభించారు. రోడ్డు ఆక్రమణపై స్థానిక మునిసిపాలిటీకి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. వందనపురి కాలనీలోని రోడ్డును ఆక్రమించడంతో కాలనీ వాసులతో పాటు పొరుగున మరో కాలనీ వారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
ఈ మేరకు స్థానిక మునిసిపాలిటీకి ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితం లేకపోవడంతో కోర్టును సైతం ఆశ్రయించారు. ఇటీవల కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదులు చేయంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి రోడ్డు ఆక్రమణను నిర్ధారించారు. నోటీసులు జారీ చేసి కూల్చివేతకు ఉపక్రమించారు. సోమవారం ఉదయం భారీ బుల్డోజర్లతో హైడ్రా సిబ్బంది వందనపురి కాలనీకి చేరుకుని కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన మరుక్షణం ఆక్రమణను తొలగించడంతో తమకు న్యాయం జరిగిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - Nov 19 , 2024 | 02:41 AM