ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: కాటేసిన కల్తీకల్లు!

ABN, Publish Date - Aug 22 , 2024 | 02:48 AM

వికారాబాద్‌ రూరల్‌ పీరంపల్లిలో కల్తీకల్లు తాగి ఒకరు మృతిచెందారు. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

  • ఒకరి మృతి.. మరొకరు విషమం

  • మరో 30 మందికి అస్వస్థత

  • వికారాబాద్‌ జిల్లా పీరంపల్లిలో ఘటన

వికారాబాద్‌, ఆగస్టు 21: వికారాబాద్‌ రూరల్‌ పీరంపల్లిలో కల్తీకల్లు తాగి ఒకరు మృతిచెందారు. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరో 30మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు మాదిరిగానే గ్రామంలోని కూలీలు 32 మంది పనులు ముగిశాక సోమవారం సాయంత్రం ఊర్లోనే కల్లుతాగారు. కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేరారు.


చికిత్స పొందుతున్న వారిలో దుర్గయ్య (55) పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎనిమిది మంది, మెడిక్యూర్‌ ఆస్పత్రిలో నలుగురు, మిషన్‌ ఆస్పత్రిలో ఆరుగురు, ఇతర ఆస్పత్రుల్లో మిగతా వారు చికిత్స పొందుతున్నారు.


కాగా సమాచరం తెలుసుకున్న అధికారులు పీరంపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా గ్రామంలో కల్లు తాగిన వారితో పాటు ఇతర గ్రామస్థులకూ వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, మండల పరిషత్తు అధికారులు గ్రామానికి వెళ్లి తాగునీటిని సరఫరా చేసే ట్యాంకులను పరిశీలించారు. పరీక్షల కోసం నీటి నమూనాలను సేకరించారు. గ్రామంలో సరఫరా అయ్యే నీటి వల్ల ఎలాంటి సమస్య లేదని అధికారులు నిర్ధారించారు.

Updated Date - Aug 22 , 2024 | 02:48 AM

Advertising
Advertising
<