ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubnagar : వన్‌కాయిన్‌ పేరుతో.. రూ.300 కోట్లకు టోకరా

ABN, Publish Date - Jun 26 , 2024 | 04:42 AM

‘వన్‌కాయిన్‌’ వర్చువల్‌ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్‌, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు..

  • తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో బాధితులు.. కర్ణాటకలో కేసు నమోదు

  • కర్నూలుకు చెందిన పాత్రధారికి బేడీలు

  • ఈ ఒక్క ఏజెంట్‌ పరిధిలో 3,600 మంది బాధితులు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘వన్‌కాయిన్‌’ వర్చువల్‌ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్‌, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు.. 2018లోనే కీలక సూత్రధారి రుజా ఇగ్నటోవ అరెస్టయినా.. భారత్‌లో.. ప్రత్యేకించి, తెలంగాణలో ఈ దందా కొనసాగడం గమనార్హం..! బాధితుల కథనం ప్రకారం.. వన్‌కాయిన్‌ ఎకో సిస్టమ్‌ పేరుతో సాగిన ఈ దందాలో.. ఏపీ, తెలంగాణతోపాటు.. కర్ణాటకకు చెందిన సుమారు 3,600 మంది బాధితులు ఉన్నట్లు.. వీరంతా రూ.300 కోట్ల మేర మోసపోయినట్లు సమాచారం. ఒక్క గద్వాల జిల్లాలోనే 80 మంది బాధితులు రూ.70 కోట్ల వరకు మోసపోయినట్లు తెలిసింది. కర్నూలుకు చెందిన వన్‌కాయిన్‌ మర్చంట్‌(ఏజెంట్‌) వీరితో పెట్టుబడులు పెట్టించారు. 2016లో ఈ దందా భారత్‌లో ప్రారంభమైంది. గొలుసుకట్టు(మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌) తరహాలో ఒకరి నుంచి మరొకరికి ప్రచారం జరిగింది. ‘‘బిట్స్‌కాయిన్స్‌ తర్వాతి స్థానం వన్‌కాయిన్‌దే..! ఆలసించిన ఆశాభంగం’’ అంటూ ఊదరగొట్టిన కేటుగాళ్లు.. యూరోల్లోనే దందాను సాగించారు. అప్పట్లో 49.5 యూరోలకు ఒక కాయిన్‌ను విక్రయించారు. తొలినాళ్లలో కేటుగాళ్లు వన్‌కాయిన్‌ విలువను అమాంతం పెంచేస్తూ.. విత్‌డ్రాకు అవకాశమిచ్చారు. 2018లో వన్‌కాయిన్‌ సూత్రధారి విదేశాల్లో అరెస్టవ్వడంతో.. పెట్టుబడిదారులకు విత్‌డ్రా ఆప్షన్‌ లేకుండా చేశారు. దీంతో బాధితులంతా కర్నూలులోని మర్చంట్‌ను నిలదీశారు. దాంతో అతను మరో మోసానికి తెరతీయడం గమనార్హం..! ‘‘డీల్‌ షేకర్‌ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. వర్చువల్‌గా మీ దగ్గరున్న వన్‌కాయిన్లతోపాటు.. రూ.లక్ష, రూ.2లక్షలు.. ఇలా పెట్టుబడి పెట్టాలి’’ అని సూచించాడు. దీంతో బాధితులు మర్చంట్‌ చెప్పిన మొత్తం చెల్లించారు. అయితే, విత్‌డ్రా అవకాశం ఇవ్వకపోవడంతో బాధితులు అతణ్ని నిలదీయగా.. ‘‘ఆత్మహత్య చేసుకోవడమే నాకు మార్గం. వియత్నాంలో వన్‌కాయిన్‌ హెడ్‌క్వార్టర్‌ ఉంది. అక్కడి వారితో మాట్లాడుతున్నా. ఇప్పటికే నా సొంత డబ్బుతో షేర్‌మార్కెట్‌లో సంపాదించి, బాధితులకు రూ.300 కోట్లు చెల్లించాను. ఇంకా రూ.287 కోట్లు చెల్లించాలి’’ అంటూ నచ్చజెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే.. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కర్నూలు మర్చంట్‌ను అరెస్టు చేశారు. ఈ విషయమై గద్వాల డీఎస్పీ సత్యనారాయణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు.

Updated Date - Jun 26 , 2024 | 04:43 AM

Advertising
Advertising