ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:24 AM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.

  • త్రీడీ టెక్నాలజీతో రక్తనాళాల గుర్తింపు

  • పొలంలో టొమాటోలు కోసే రోబో

  • సైనికుల రక్షణ కోసం ఫైర్‌ సేఫ్టీ సూట్‌

  • ఐఐటీహెచ్‌లో అద్భుత ఆవిష్కరణలు

కంది, జూలై 15: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి సందర్భాల్లో రక్తనాళం ఎక్కడుందో చూపించే పరికరం అందుబాటులో ఉంటే? అద్భుతమైన ఆ పరికరాలు ఎక్కడో ఊహల్లో కాదు.. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం ఆవిష్కృతం అయ్యాయి. దేశంలోని విద్యాసంస్థలు, పరిశ్రమల అనుసంధానంతో ఐఐటీహెచ్‌లో జరిగిన ‘ఇన్నోవేషన్‌ డే ఫెయిర్‌’ ఈ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ ఉత్సవాన్ని ఐఐటీహెచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు.


ఇందులోని బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరిశోధకులు.. ‘సీ-కాలర్‌ డిటెక్షన్‌’ పేరుతో సర్వీసెల్ఫ్‌ కిట్‌ను తయారుచేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షను మహిళలు ఈ కిట్‌ సాయంతో ఇంటివద్దే చేసుకోవచ్చు. అలాగే.. ఐఐటీహెచ్‌లోని భౌతికశాస్త్ర విభాగం పరిశోధకులు ఇన్‌ఫ్రారెడ్‌, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి.. స్కానింగ్‌తో నరాలను కనిపెట్టే టెక్నాలజీ అభివృద్ధి చేశారు. ‘త్రీడీ వెయిన్‌ వ్యూయర్‌’గా పిలిచే ఈ పరికరంతో ఒక్కసారి మన శరీరంపై స్కాన్‌ చేస్తే ఒంట్లోని రక్తనాళాలు స్పష్టంగా కనపడతాయి. ఇది డాక్టర్లు, నర్స్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది పేషెంట్లకు త్వరగా ఇంజెక్షన్లు చేయడానికి, రక్త పరీక్షలు తొందరగా నిర్వహించడానికి వీలుగా ఉంటుంది.


భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఉపయోగించి రోబోలతో కూడా ఇంజెక్షన్‌లు, రక్త పరీక్షలు చేయించవచ్చు. ఇక.. ఐఐటీహెచ్‌ ఇంక్యుబేషన్‌ స్టార్టప్‌ పరిశోధకులు ఇండియన్‌ నేవీతో కలిసి ట్రాడీ గ్రేడ్‌ ఫైర్‌ రెసిస్టెంట్‌ సూట్‌ను తయారు చేశారు. 2.3 కేజీల బరుగల ఈ సూట్‌ 1200 డిగ్రీల వరకూ వేడిని తట్టుకుంటుంది. ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకున్నా.. ఈ సూట్‌ వేసుకున్న వారి ప్రాణాలకు హాని జరగదు. అగ్ని ప్రమాదాలు జరిగి మంటల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకురావడానికి.. అగ్నిమాపక దళాలకు ఈ సూట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే.. ఐఐటీహెచ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన పరిశోధకులు కూరగాయల రైతులకు ఖర్చు తగ్గించేందుకు అగ్రీబాట్‌ పేరుతో.. టొమాటో పంటను సంరక్షించి, టొమాటోలను కోసే యంత్రాన్ని రూపొందించారు. ఇవి కాక.. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వాతావరణ మార్పు, ఈ-మొబిలిటీ, క్లీన్‌ఎనర్జీ, స్థిరమైన సాంకేతికతలు, రక్షణకు సంబంధించి 35 రకాల ఆవిష్కరణలను ఈ వేడుకలో ప్రదర్శించారు.

Updated Date - Jul 16 , 2024 | 05:24 AM

Advertising
Advertising
<