ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kamareddy: ప్రజాపాలనకు తిరుగులేని సాక్ష్యం

ABN, Publish Date - Nov 21 , 2024 | 03:44 AM

మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవులు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే సాధారణంగా దక్కుతాయి. కానీ, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎంపిక వినూత్నంగా జరిగింది.

  • మద్నూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నియామకంపై సీఎం రేవంత్‌

  • ఇంటర్వ్యూ ద్వారా చైర్మన్‌ ఎంపిక

  • ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, చైర్‌పర్సన్‌గా ఎంపికైన సౌజన్యకు

  • సీఎం రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డి అభినందన

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవులు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే సాధారణంగా దక్కుతాయి. కానీ, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎంపిక వినూత్నంగా జరిగింది. ప్రతిభ కలిగిన విద్యావంతులు చైర్మన్‌ అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే ఆలోచనతో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వినూత్న ప్రయత్నం చేశారు. మూడు మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముగ్గురు సీనియర్‌ లీడర్లతో ఓ కమిటీ నియమించి ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యావంతురాలు, నిరుపేద కుటుంబానికి చెందిన అయిల్వార్‌ సౌజన్య అనే కాంగ్రెస్‌ కార్యకర్తను మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసి నియామకం చేపట్టారు. సౌజన్య ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. కాగా, సౌజన్య నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


ప్రతిభకు ప్రాధాన్యమిస్తూ, మహిళలను ప్రోత్సహించే విధంగా జరిగిన ఈ ఎంపిక కొత్త ఒరవడి సృష్టించిందని పేర్కొన్నారు. సౌజన్య ఎంపిక ప్రజాస్వామ్యంలో ఓ నూతన అధ్యాయమని, ప్రజాపాలనకు తిరుగులేని సాక్ష్యమని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ నియామకంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు అభినందనలు తెలియజేశారు. ఇక, రాజకీయాల్లో ఎక్కడో ఓ చోట మార్పు మొదలుకావాలని, అలాంటి మార్పు సౌజన్య నియామకంతో మొదలైందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సౌజన్య హైదరాబాద్‌లో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీకాంతరావు సమకాలిన రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి నాంది పలికారని ప్రశంసించారు. డబ్బు ప్రమేయం పెరిగిందన్న కారణంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న యువతకు ఇలాంటి ప్రయోగాలు నమ్మకాన్ని కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, పీసీసీ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సౌజన్య ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - Nov 21 , 2024 | 03:44 AM