Khammam: రెండు రేషన్ కార్డులపై ఇంటెలిజెన్స్ విచారణ
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:39 AM
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురంలో ఓ నాయకుడు తనతో పాటు తన భార్య పేరిట రెండు రేషన్ కార్డులతో రుణమాఫీ పొందిన వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది.
‘ఆంధ్రజ్యోతి’ విలేకరికి సదరు నేత నుంచి బెదిరింపు కాల్స్
నేలకొండపల్లి, సెప్టెంబరు 28 : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురంలో ఓ నాయకుడు తనతో పాటు తన భార్య పేరిట రెండు రేషన్ కార్డులతో రుణమాఫీ పొందిన వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. రెండు రేషన్‌కార్డులతో భార్యాభర్తలు వేర్వేరుగా రుణమాఫీ పొందిన విషయంపై ‘‘వామ్మో మూటాపురం లీడరు’’ శీర్షికతో శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ అధికారులు మూటాపురంలో విచారణ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సహకార సంఘం కార్యాలయంలో వివరాలను సేకరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. వ్యవసాయాధికారులు సైతం ఆ నేత ఎవరని విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు లీడరు ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై బెదిరింపులకు దిగాడు. ‘‘అన్ని ఆధారాలతోనే వార్త రాశారా.. నా గురించి నీకు తెలుసా? ఫైటింగ్‌కు రెడీనా?’’ అంటూ సవాల్ విసిరాడు.
Updated Date - Sep 29 , 2024 | 04:39 AM