ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: మాది ప్రజలు మెచ్చే పాలన... బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి

ABN, Publish Date - Aug 15 , 2024 | 06:30 PM

కాంగ్రెస్ పాలన ప్రజలు మెచ్చే విధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 8 నెలల్లో పార్టీ పూర్తి నాయకత్వం ప్రజల్లోనే ఉందన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పాలన ప్రజలు మెచ్చే విధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 8 నెలల్లో పార్టీ పూర్తి నాయకత్వం ప్రజల్లోనే ఉందన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజల వద్దకు వెళ్లలేదని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. "8 నెలలుగా కాంగ్రెస్ నాయకత్వం ప్రజల్లోనే ఉంది. గత పదేళ్లుగా ప్రజల మధ్య కేసీఆర్ ఏనాడూ రాలేదు. అందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజలు నచ్చి, మెచ్చే పాలనను మా ప్రభుత్వం అందిస్తోంది. వారు ఇచ్చిన సమయాన్ని వృథా చేయట్లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, లోపాలు అన్ని ఇన్నీ కావు. వాటన్నింటినీ సవరిస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాం. ఆ తప్పిదాలు మరోసారి జరగకుండా చూస్తాం. ఆగస్టు 15తో 2 లక్షల రుణమాఫీ పూర్తయింది. రుణమాఫీ కానివారెవరైనా మిగిలితే అందరికీ మాఫీ చేస్తాం. ఇంత స్పష్టంగా మా పాలన కొనసాగుతుంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. అధికారం పోయే సరికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు పిచ్చి లేస్తోంది. వారికి నిద్ర కూడా పట్టడం లేదు. 8 నెలలకే ఉపఎన్నికలు వస్తాయని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల పిచ్చిఏంటి? కేటీఆర్‌కు ఎన్నికలు అంటే అంత ఇష్టమా. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు ఇచ్చిన విషయం మర్చిపోయారా.


కేసీఆర్ సొంత గడ్డా మెదక్‌లోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. ట్రబుల్ షూటర్ అని బీఆర్ఎస్ నేతలు పిలుచుకునే హరీశ్‌రావు‌కు ఏమైంది. మెదక్‌లో బీఆర్ఎస్‌కు మూడో స్థానం వచ్చిందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా. అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు చేరడం సాధారణమే. తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. చేరికల సంప్రదాయం మొదలుపెట్టిందే కేసీఆర్. పదేళ్ళలో కేసీఆర్ ఏనాడూ ప్రజా పాలన అందించలేదు. ఆయన అధికారంలో ఉంటే ప్రజా భవన్, ఫౌంహౌస్, ప్రతిపక్షంలో ఉంటే ఉప ఎన్నికలు. ఇదే బీఆర్ఎస్ వైఖరి. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడుతుంది. అధికారంలో ఉంటే ప్రజా పరిపాలన అందిస్తుంది. బీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికల జపాన్ని వీడాలి. ప్రజా సమస్యలపై సూచనలిస్తే స్వాగతిస్తాం. గోబల్స్ ప్రచారాన్ని ఆపండి. రూ. 2 లక్షల రుణమాఫీ బీఆర్ఎస్ నేతల కళ్ళ ముందే చేశాం. కనపడడం లేదా. కళ్ళకు గంతలు కట్టుకున్నారా, లేక రైతుల సంతోషాన్ని ఓర్వలేకపోతున్నారా? బీఆర్ఎస్ గల్లీ పార్టీ.. మాది ఢిల్లీ పార్టీ. తెలంగాణ ప్రజలు సోనియా, రాహుల్‌గాంధీలకు ఓటేశారు. కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గల్లీ పార్టీ లీడర్ గల్లీలో ఉన్నారు. మా ఢిల్లీ పార్టీ లీడర్ ఢిల్లీలో ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పనిని మా అగ్రనేతకు చెబుతాం" అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 06:34 PM

Advertising
Advertising
<