Jani Master: గోవాలో జానీ మాస్టర్ అరెస్టు..
ABN, Publish Date - Sep 20 , 2024 | 03:09 AM
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీబాషా అలియాస్ జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
నేడు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన జానీమాస్టర్ భార్య ఆయేషా
నార్సింగ్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీబాషా అలియాస్ జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకొస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జానీ మాస్టర్‌పై ఈ నెల 15న రాయదుర్గం పోలీ్‌సస్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్ కాగా, అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారని ఆయన వెల్లడించారు.
జానీమాస్టర్‌ను శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. కాగా.. జానీ మాస్టర్ భార్య ఆయేషా గురువారం నార్సింగ్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. జానీ మాస్టర్ అరెస్ట్ విషయం తనకు తెలియదని.. తనకు వచ్చిన ఒక ఫేక్ కాల్ గురించి తెలుసుకునేందుకే ఠాణాకు వచ్చానని ఆమె మీడియాకు చెప్పారు. అయితే.. జానీ మాస్టర్ అరెస్టు గురించి పోలీసులు ఆయన భార్యకు సమాచారం ఇచ్చి, పోలీ్‌సస్టేషన్‌లో సంతకాలు తీసుకుని పంపించినట్టు సమాచారం.
Updated Date - Sep 20 , 2024 | 03:09 AM