ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై అలక వీడిన జీవన్ రెడ్డి..

ABN, Publish Date - Jun 26 , 2024 | 10:09 PM

ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అలక వీడారు. కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి వెల్లడించారు.

ఢిల్లీ: ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) అలక వీడారు. కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పవని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal) హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ (Deepa Das Munshi), కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం తన రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ వెల్లడించారు. ఈ సమావేశంలోమంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో సమావేశం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.."కాంగ్రెస్ పార్టీలో చేరికలకు ఎప్పుడూ డోర్లు తెరిచే ఉంటాయి. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదు. పీసీసీపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో మొదటినుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గకుండా చూస్తాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక వల్ల జీవన్ రెడ్డి అమర్యాదగా, అగౌరవంగా భావించారు. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత, ఆయణ్ని కించపరచడం మా ఉద్దేశం కాదు. ఆయనకు ఎప్పుడూ తగిన ప్రాధాన్యత ఉంటుంది" అని ఆమె చెప్పారు.

Updated Date - Jun 26 , 2024 | 10:14 PM

Advertising
Advertising