JNTU: జేఎన్‌టీయూలో ఎన్నాళ్లీ ‘ఇన్‌చార్జీల పాలన’
ABN, Publish Date - Nov 23 , 2024 | 08:00 AM
జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ లేరు. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతున్నారు. ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి(IAS officer) యూనివర్సిటీకి తరచుగా రాకపోవడంతో వర్సిటీలో పాలన పూర్తిగా గాడితప్పింది.
- పలు విభాగాలకు రెగ్యులర్ డైరెక్టర్లు లేక అకడమిక్స్‌పై కొరవడిన పర్యవేక్షణ
- నిలిచిన అభివృద్ధి పనులు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెళ్లుగా రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్ లేరు. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతున్నారు. ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి(IAS officer) యూనివర్సిటీకి తరచుగా రాకపోవడంతో వర్సిటీలో పాలన పూర్తిగా గాడితప్పింది. ఇన్‌చార్జి వీసీ మాదిరిగానే కొన్ని డైరెక్టర్ పోస్టుల్లో ఇన్‌చార్జిలుగా ఉన్న అధికారులు సైతం ముఖ్యమైన పనుల పట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: లింకులు పంపి ఖాతాలు ఖల్లాస్
ఎనిమిది నెలలుగా యూనివర్సిటీకి పాలకమండలి కూడా లేకపోవడంతో పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించేందుకు వీలు కావడం లేదని తెలుస్తోంది. దీంతో అకడమిక్స్‌పైనా, అభివృద్ధి పనులపైనా పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడింది. రూ. 5లక్షలకు పైబడి ఏ అభివృద్ధి పనిని చేపట్టాలన్నా అనుమతించే దిక్కు లేకుండా పోయింది. దీంతో వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఈవిద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన సుమారు రూ.200కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఓవైపు ఇబ్బడి ముబ్బడిగా కోర్సులు, విద్యార్థులు పెరగడం తో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించలేని దుస్థితి నెలకొంది.
ఇన్‌చార్జి బాధ్యతలతో కొందరిపై అదనపు భారం
జేఎన్‌టీయూలోని పలు విభాగాలకు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వంటి పోస్టుల్లో ఉన్న ప్రొఫెసర్లకే ఖాళీగా ఉన్న విభాగాలకు ఇన్‌చార్జిలుగా నియమించడంతో వారిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో కొన్ని తరగతుల విద్యార్థులకైనా పాఠాలు చెప్పేందుకు వారికి సమయం దొరకడం లేదు. మరోవైపు దశాబ్దాల పాటు అడ్మినిస్ట్రేషన్ పోస్టుల్లో ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఒక్కసారి కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని మరికొందరు సీనియర్ ప్రొఫెసర్లను తరచుగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలో ఇన్నోవేషన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ (డిల్ట్) డైరెక్టరు క్రిష్ణమోహనరావు అడ్మిషన్ల విభాగం ఇన్‌చార్జి డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అడ్మిషన్ల విభాగం డిప్యూటీ డైరెక్టర్ సైదానాయక్ కళాశాల పరీక్షల విభాగానికి ఇన్‌చార్జి అధికారిగా ఉన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్ష న్ సెల్(యూఐఐసీ) డైరెక్టర్ రజిని ఈసీఈ ఇన్‌చార్జి విభాగాధిపతిగా, గ్లోబల్ అలూమ్ని డైరెక్టర్ సురేశ్‌కుమార్ యూఐఐసీకి ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ అరుణకుమారి మహబూబాబాద్ జేఎన్‌టీయూకు నోడల్ అధికారిగా, అటానమస్ కాలే జెస్ అఫైర్స్ డైరెక్టర్ రవీంద్రారెడ్డి పాలేరు జేఎన్‌టీయూ నోడల్ అధికారిగా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్ శ్రీకాంత్.. ఫిజిక్స్ విభాగాధిపతిగా, జె-హబ్ డైరెక్టర్ శ్రీదేవి సైబర్ సెక్యూరిటీ విభాగం సమన్వయకర్తగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎ్‌సఎస్ సమన్వయకర్త శోభారాణి ఫార్మసీ ఇన్‌చార్జి విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు.
అకడమిక్స్ అఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్వీ రమణకు అదే విభాగానికి ఇన్‌చార్జి భాధ్యతలు అప్పగించారు. కీలకమైన క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డిని, మరిం త కీలకమైన టీజీపీఎస్సీ పరీక్షలకు కన్వీనర్‌గా నియమించడంతో ఆయనకు క్షణం తీరికలేని పరిస్థితి నెలకొంది. ఐక్యూఏసీ, యూజీసీ-ఎంఎంటీటీసీ విభాగాలకు కూడా ఇన్‌చార్జి అధికారులనే నియమించారు. దీంతో ఆయా విభాగాల్లో విద్యార్థులకు, ఉద్యోగుల సమస్యలకు వెంటనే పరిష్కారాలు లభించడం లేదు. కొందరు అధికారులు తగినంత సమయం కేటాయించ లేక పోవడంతో సంబంధింత ఫైళ్లన్నీ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.
ఏళ్ల తరబడి పదవులకు దూరంగాకొందరు సీనియర్లు
అదనపు పనిభారంతో ఇబ్బంది పడుతున్న అధికారుల ను ఇన్‌చార్జి పదవుల నుంచి విముక్తి కల్పించాలని, ఎంతోకాలంగా ఒక్క పదవీ కూడా చేపట్టని సీనియర్ ప్రొఫెసర్లకు అవకాశాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలకమండలిని తక్షణమే ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి అధికారులను నియమించడంతో పాటు అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 08:00 AM