ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubnagar: బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదు: జూపల్లి

ABN, Publish Date - Dec 02 , 2024 | 03:50 AM

మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండగ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు.

  • పాలమూరు ప్రజలకు కేసీఆర్‌ మోసం: యెన్నం

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండగ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు జిల్లా రైతన్నల సాగు నీటి కష్టాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్చలేక పోయిందని, జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సీఎం కేటాయిస్తున్నారని చెప్పారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎ్‌సకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. రైతు పండగ సభకు లక్షలాదిగా రైతులు తరలివచ్చి.. సీఎం రేవంత్‌ను ఆశీర్వదించారన్నారు. పాలమూరు ప్రజలను మాజీ కేసీఆర్‌ మోసం చేశాడని ఆరోపించారు. అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బాగుపడటం ఇష్టం లేని బీఆర్‌ఎస్‌ నేతలు.. పరిశ్రమల ఏర్పాటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Updated Date - Dec 02 , 2024 | 03:51 AM