ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్‌ తల్లి: ఎమ్మెల్సీ కవిత

ABN, Publish Date - Dec 10 , 2024 | 03:31 AM

ఉద్యమ స్ఫూర్తితో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్‌ తల్లిగా మార్చారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఈ దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందన్నారు.

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ స్ఫూర్తితో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్‌ తల్లిగా మార్చారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఈ దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందన్నారు. కోట్లాది మంది బిడ్డల్లో స్ఫూర్తిని నింపిన తల్లి రూపాన్ని మార్చడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ వద్ద అరెస్టు చేసిన నేపథ్యంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాము కాంగ్రెస్‌ తల్లిని తిరస్కరిస్తున్నామన్నారు.


విగ్రహ స్వరూపాన్ని మార్చి అవమానించిన సీఎం గన్‌పార్క్‌ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. 18 ఏళ్లలో ఎవరూ తెలంగాణ తల్లి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం అక్కసుతోనే తెలంగాణ తల్లిని కాంగ్రెస్‌ తల్లిగా మార్చిందని ఆరోపించారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేయడం దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు. ఎన్నికల హామీని అమలు చేయమని అడిగినందుకు ఆశా వర్కర్లను పోలీసులతో కొట్టించడం అమానుషమన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా రేవంత్‌ సర్కారు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బహుమతి ఇదేనా? ప్రజా పాలన అంటే ఇదేనా? అని కవిత ప్రశ్నించారు.

Updated Date - Dec 10 , 2024 | 03:31 AM