Kakatiya University: కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు
ABN, Publish Date - Oct 03 , 2024 | 03:31 AM
కాకతీయ యూనివర్సిటీ(కేయూ) సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబును సస్పెండ్ చేస్తూ బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కేయూ క్యాంపస్, అక్టోబరు 2: కాకతీయ యూనివర్సిటీ(కేయూ) సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబును సస్పెండ్ చేస్తూ బుధవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్(వీసీ) వాకాటి కరుణ ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి చెందిన భూమిలో ఇల్లు నిర్మించుకున్నట్లు అశోక్‌బాబుపై ఆరోపణలున్నాయి.
ఇటీవల వర్సిటీలో భూ సర్వే సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, తాజాగా బుధవారం కేయూలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో గందరగోళం సృష్టించారని, వర్సిటీ ఉద్యోగుల నిబంధనలు, సీసీఏ రూల్స్ మేరకు అశోక్‌బాబుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Updated Date - Oct 03 , 2024 | 03:31 AM